ఆర్ఆర్ఆర్ తర్వాత యంగ్ టైగర్ కాస్త గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దాంతో ఎన్టీఆర్ 30 కోసం అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. ఇప్పుడా సమయం రానే వచ్చేసింది. ఇప్పటి వరకు ఎన్టీఆర్ 30పై వస్తున్న పుకార్లకు చెక్ పడింది. ఇటీవలె ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టిన కొరటాల శివ.. ఇప్పుడు మ్యూజిక్ సిట్టింగ్స్‌లో ఉన్నాడు.
ఎన్టీఆర్ 30కి కోలీవుడ్ టాలెంటెడ్ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవల వచ్చిన విక్రమ్ సినిమాను బీజిఎంతో నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లాడు అనిరుధ్. అసలు అనిరుధ్ లేకుండా ‘విక్రమ్’ సినిమాను ఊహించుకోలేం. అందుకే ఎన్టీఆర్ 30 మ్యూజిక్ ఆల్బమ్ పై భారీ అంచనాలున్నాయి. ఇక ఇప్పుడు కొరటాల బాక్సులు బద్దలయ్యే అప్టేట్ ఇచ్చాడు.
రీసెంట్గా అనిరుధ్‌తో మ్యూజిక్ డిస్కషన్స్ మొదలైనట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ఇవ్వడానికి కొరటాల శివ, అనిరుధ్ రంగంలోకి దిగారని.. ఎన్టీఆర్ ఆర్ట్స్ ట్వీట్ చేసింది. అనిరుధ్ కూడా ఎన్టీఆర్ 30 ఎంతో ప్రత్యేకం కాబోతోందని పేర్కొన్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ నేపథ్యంలో అనిరుధ్ పారితోషికం గురించి చర్చ జరుగుతోంది. ఈ సినిమా కోసం అనిరుధ్ భారీగా డిమాండ్ చేస్తున్నాడట. ఇప్పటి వరకు 4 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకున్న అనిరుధ్.. ఎన్టీఆర్ 30 కోసం ఐదు నుంచి ఆరు కోట్లు అందుకోబోతున్నట్టు తెలుస్తోంది. మేకర్స్ కూడా అందుకు ఓకే చెప్పారట. మరి ఎన్టీఆర్ 30తో అనిరుధ్ ఎలా అదరగొడతాడో చూడాలి.