ఆచార్యతో ఫ్లాప్ అందుకున్న మెగాస్టార్.. గాడ్ ఫాదర్‌తో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ప్రస్తుతం బాబీ డైరెక్షన్లో ‘వాల్తేరు వీరయ్య’ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో చిరు వింటేజ్ లుక్‌ను చూసేందుకు ఎగ్జైటింగ్‌గా ఎదురు చూస్తున్నారు మెగాభిమానులు. పైగా ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ నటిస్తున్నాడు. దాంతో నెక్ట్స్ లెవల్ అంచనాలున్నాయి. ఇటీవలె ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాతో థియేటర్ల వద్ద మాస్ జాతరేనని అంటున్నారు. అందుకే ఇప్పుడు మరోసారి మాస్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ సారి రవితేజకు సంబంధించిన టీజర్ రిలీజ్ చేయబోతున్నారట. ఇప్పటికే టీజర్ కట్ వర్క్ నడుస్తోందని టాక్. అతి త్వరలో దీనిపై క్లారిటీ రానుందని అంటున్నారు. దాంతో మెగా, మాస్ రాజా అభిమానులు ఈ టీజర్ రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. జనవరి 13న వాల్తేరు వీరయ్య థియేటర్లోకి రానున్నాడని సమాచారం. త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు. దాంతో ప్రస్తుతం బ్యాలెన్స్ షూటింగ్‌ను ఫినిష్ చేసే పనిలో ఉంది చిత్ర యూనిట్. ఇక మాస్ రాజా టీజర్‌తో పాటు.. త్వరలో ఫస్ట్ సింగిల్ కూడా విడుదల చేయనున్నారని తెలుస్తోంది. ఇక శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.