Ram Charan : రాజమౌళి సినిమాను పక్కకు పెట్టేసిన రామ్ చరణ్!
Ram Charan : నిజమే.. దర్శక ధీరుడు రాజమౌళి సినిమాను పక్కకు పెట్టేసి.. ఫ్లాప్ సినిమాతో మరోసారి థియేటర్లోకి రాబోతున్నాడు రామ్ చరణ్. రీసెంట్గా ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ రావడంతో.. చరణ్ గ్లోబల్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్ కలిసి ఆర్సీ 15 ప్రాజెక్ట్ చేస్తున్నాడు.
నిజమే.. దర్శక ధీరుడు రాజమౌళి సినిమాను పక్కకు పెట్టేసి.. ఫ్లాప్ సినిమాతో మరోసారి థియేటర్లోకి రాబోతున్నాడు రామ్ చరణ్. రీసెంట్గా ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ రావడంతో.. చరణ్ గ్లోబల్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్ కలిసి ఆర్సీ 15 ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ని.. మార్చి 27న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఆరోజు చరణ్ బర్త్ డే ఉంది కాబట్టి ఫస్ట్ లుక్‌తో పాటు.. టీజర్ కూడా రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఈ సినిమాకి ‘సీఈవో’ అనే టైటిల్ వినిపిస్తోంది. అయితే చరణ్ బర్త్ డే నాడు ఆర్సీ 15 అప్డేట్ మాత్రమే కాదు.. చరణ్ కెరీర్లో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ‘మగధీర’ మూవీని కూడా రీ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు మగధీర సినిమాని ఆపేసి, ఫ్లాప్ అయిన ‘ఆరెంజ్’ మూవీ రీరిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ హవా నడుస్తోంది. నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంతో.. రాజమౌళి పేరు మార్మోగిపోతోంది. ఇలాంటి సమయంలో చరణ్, రాజమౌళి కాంబోలో వచ్చిన ‘మగధీర’ రీ రిలీజ్ చేస్తే.. భారీ వసూళ్లు వచ్చే ఛాన్స్ ఉంది. కానీ మెగా ఫ్యాన్స్ మాత్రం ఎన్నో ఏళ్లుగా ఆరెంజ్ మూవీని రీరిలీజ్ చెయ్యమని అడుగుతున్నారు. అప్పట్లో ఈ సినిమా ఫ్లాప్ అయినా.. ఆ తర్వాత మాత్రం బాగా కనెక్ట్ అయిపోయారు. ముఖ్యంగా ఆరెంజ్ మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. అందుకే ఇప్పుడు ఆరెంజ్ సినిమాను రీ రిలీజ్ చేయబోతున్నారా.. లేదంటే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా.. అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాకు వచ్చే వసూళ్లను జనసేన పార్టీకి ఫండ్‌గా ఇవ్వాలని అనుకుంటున్నారు మెగా అభిమానులు. మరి ఈసారి ఆరెంజ్‌కు థియేటర్లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.