సలార్ నుంచి ఎలాంటి అప్టేట్ వచ్చిన.. ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ హంగామా చేస్తున్నారు. తాజాగా సలార్ నుంచి వచ్చిన సింగిల్ వర్డ్ అప్టేట్.. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. దాంతో సలార్ పై అంచనాలు నెక్ట్స్ లెవల్‌కి వెళ్తున్నాయి. కెజియఫ్ చాప్టర్ 2లో యష్ చెప్పిన వైలెన్స్ డైలాగ్ ఎంత హైలెట్‌గా నిలిచిందో అందరికీ తెలిసిందే. ఒక్క డైలాగే కాదు ఆ సినిమాలో ప్రశాంత్ నీల్ చేసిన వైలెన్స్ అంతా ఇంతా కాదు. అందుకు తగ్గట్టే బాక్సాఫీస్‌ను షేక్ చేసేసింది కెజియఫ్2. దాంతో కెజియఫ్2 తర్వాత ప్రశాంత్ నీల్ చేస్తున్న సలార్ పై భారీ అంచనాలున్నాయి. పైగా సలార్ మేకర్స్ ఈ సినిమాను హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నట్టు.. పలు సందర్భాల్లో చెబుతున్నారు.
అసలు ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి పోస్టర్స్ తప్పితే.. ఎలాంటి వీడియో రిలీజ్ చేయలేదు. కానీ పోస్టర్స్కే ఊగిపోతున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. అయితే ఈ సినిమాను వచ్చే ఏడాది సెప్టెంబర్ 28న రిలీజ్ చేయబోతున్నారు. కాబట్టి ఇప్పట్లో టీజర్ రావడం కష్టం. కానీ సింగిల్ వర్డ్స్‌తో క్రేజీ అప్టేట్స్ ఇస్తున్నారు మేకర్స్. తాజాగా ట్విట్టర్లో ‘వైలెంట్’ అని పోస్ట్ చేయడంతో.. అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. సలార్ సినిమా ఎలా ఉంటుందో ఒక్క మాటలో చెప్పేశారంటూ.. పండగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. అయితే ఇప్పుడు సలార్ లేటెస్ట్ షెడ్యూల్ మొదలు కావడంతో.. ఈ షెడ్యూల్లో వైలెన్స్ ఎక్కువగా ఉంటుందని చెప్పేలా.. ఈ అప్టేట్ ఇచ్చి ఉంటారని అంటున్నారు. దీన్ని బట్టి చూస్తే సలార్ ఎంత వైలెంట్‌గా తెరకెక్కుతుందో ఊహించుకోవచ్చు. మరి సలార్ ఎలాంటి విధ్వంసం సృష్టిస్తుందో చూడాలి.