ప్రస్తుతం ఎనర్జిటిక్ యంగ్ హీరో రామ్(Ram).. మాస్ డైరెక్టర్ బోయపాటి(Boyapati) శ్రీనుతో పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నాడు. శ్రీలీలా హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను.. ఇటీవలే సెట్స్ పైకి తీసుకెళ్లారు. రామ్-బోయపాటి కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. పైగా అఖండ తర్వాత బోయపాటి చేస్తున్న సినిమా కావడంతో.. దీని పై భారీ అంచనాలున్నాయి. దాంతో రామ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎవరితో ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో మన జాతిరత్నం అనుదీప్‌తో రామ్ సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది.
జాతి రత్నాలు సినిమా తర్వాత ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ అనే కళాఖండం తీసి చేతులు కాల్చుకున్నాడు కెవి అనుదీప్. ఆ సినిమాకు దర్శకత్వం వహించకపోయినా.. అన్నీ తానై నడిపించాడు అనుదీప్. దాంతో ఫ్లాఫ్ క్రెడిట్ అతనికే దక్కింది. ఇక జాతి రత్నాలు తర్వాత ప్రిన్స్ అనే తమిళ్, తెలుగు బైలింగ్వువల్ ప్రాజెక్ట్ చేశాడు అనుదీప్. శివకార్తికేయన్ హీరోగా తెరకెక్కిన ఈ మూవీ సోసోగానే నిలిచింది. దాంతో జాతిరత్నం వాట్ నెక్ట్స్ ఏంటనేది ఇంట్రెస్టింగ్గా మారింది.
చాలా రోజులుగా వెంకటేష్‌తో ఓ సినిమా చేయబోతున్నాడని వినిపించగా.. ఇప్పుడు ఎనర్జిటిక్ హీరో రామ్ ఇతనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. దాంతో ప్రస్తుతం రామ్‌కి సరిపడే కథ పై కసరత్తులు చేస్తున్నాడట అనుదీప్. ఇదొక రొమాంటిక్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. అయితే పాన్ ఇండియా ప్రాజెక్ట్ తర్వాత రామ్.. అనుదీప్‌తో సినిమా చేస్తాడా.. లేదా.. అనేది డౌటే. కానీ ఇస్మార్ట్ శంకర్ తర్వాత మాస్ బాట పట్టిన రామ్.. చేంజ్ ఓవర్ కోసం అనుదీప్‌తో సినిమా చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయంటున్నారు.