యంగ్ బ్యూటీ కృతిశెట్టిని అయ్యో పాపం అంటుండగా.. సీతారమం బ్యూటీ మృణాల్ ఠాకూర్ పై మాత్రం మండి పడుతున్నారు నెటిజన్స్. అసలు ఈ ఇద్దరు హీరోయిన్లు ఏం చేశారనే విషయంలోకి ఓ సారి చూద్దాం. సక్సెస్ వస్తే హీరోయిన్లు రేంజ్ పెరగడమే కాదు.. ప్రశంసలతో ముంచెత్తుతారు నెటిజన్స్. ఒకవేళ ఫెయిల్యూర్స్ వస్తే మాత్రం ఫైర్ అవడంతో పాటు.. అప్పుడప్పుడు జాలి కూడా చూపిస్తుంటారు. ఇప్పుడు కృతిశెట్టి పరిస్థితి కూడా ఇలాగే ఉంది. హ్యాట్రిక్ హిట్ బ్యూటీగా దూసుకెళ్తున్న కృతి.. ఇప్పుడు హ్యాట్రిక్ ఫ్లాప్ బ్యూటీగా మారిపోయింది. ఇప్పటికే ‘ది వారియర్’, ‘మాచర్ల నియోజక వర్గం’ సినిమాలు ఫ్లాప్ ఇవ్వగా.. రీసెంట్గా వచ్చిన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ మూవీ కూడా కృతిని కాపాడలేకపోయింది. దాంతో పాపం కృతి కెరీర్ డేంజర్లో పడే ఛాన్స్ ఉందని అంటున్నారు జనాలు.
ఇక మరో బ్యూటీ పరిస్థితి మాత్రం వేరేలా ఉంది. ఇటీవల వచ్చిన సీతారామం మూవీ క్లాసికల్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇందులో మృణాల్ ఠాకూర్‌ని అందానికి ఫిదా అయిపోయారు కుర్రకారు. ఆమెను సీత పాత్రలో చూసి నిజంగానే సీతలా ఉందని మురిసిపోయారు. కానీ ఇప్పుడు అమ్మడు చేస్తున్న పనికి ఫైర్ అవుతున్నారు. సీత పాత్రలో తెలుగమ్మాయిలా కనిపించిన మృణాల్, సోషల్ మీడియాలో హాట్ ట్రీట్మెంట్ ఇస్తోంది. దాంతో అమ్మడు ఇలా చేస్తుందనుకోలేదని రకరకాల కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు. ఏదేమైనా హీరోయిన్ చేసే పాత్రలను బట్టే ఆడియెన్స్ రియాక్షన్ ఉంటుందని చెప్పొచ్చు.