Nawazuddin Siddiqui: పుకార్లపై క్లారిటీ ఇచ్చిన నవాజుద్దీన్ సిద్ధిఖీ
పుకార్లపై స్పందిస్తూ ఉంటే కెరీర్ పై శ్రద్దవహించలేమన్నారు నవాజుద్దీన్ సిద్ధిఖీ(Nawazuddin Siddiqui). సమయంతోపాటు అవే కాలంలో కలిసి పోతాయన్నారు. స్థాయి తక్కువవారు తమ స్థాయికి ఎదుటివారిని లాగాలని చూస్తారని అన్నారు.
బాలీవుడ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ(Nawazuddin Siddiqui) తనపై వస్తున్న పుకార్లపై స్పందించాడు. వైవాహిక జీవితంలో అతను ఎదుర్కొంటున్న ఇబ్బందులకు గాను ఇటీవల వార్తల్లో నిలిచాడు. భార్య అలియా సిద్ధిఖీతో విడాకులు తీసుకోబోతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం అతను అఫ్యా, జోగిరా సర రారా సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నట్లు చెప్పాడు. ఒక ఇంటర్వూలో మాట్లాడిన ఆయన.. మీపై వచ్చిన పుకార్లకు ఎందుకు సమాదానం ఇవ్వరన్న ప్రశ్నకు బదులిస్తూ… ఊహాగానాలను ఎవ్వరూ ఏమీ చేయలేరని సిద్ధిఖీ అన్నాడు.
“పుకార్లను ఎవరూ ఏమీ చేయలేరు. ఒక వ్యక్తిని విలన్గా చూయించడానికి ఉద్దేశపూర్వకంగా ఎవరో ఒక పుకారును సృష్టిస్తారు. ఇతరులు వ్యాప్తి చేస్తారు. మిగితావాళ్లు కూడా నిప్పుకు ఆజ్యం పోస్తూ పుకారును మరింత వ్యాప్తి చేసేందుకు ప్రయత్నిస్తారు, ప్రజలు దానిని నమ్మడం ప్రారంభిస్తారు. పుకార్లపై ఆ వ్యక్తి తిరిగి ప్రశ్నిస్తే… అతను విలన్ అవుతాడు. నిజం బయటకు వచ్చే సమయానికి అతని కెరీర్ ముగిసిపోతుంది. అగర్ ఏక్ కి పిట్ రహీ హై తో.. సబ్ మజే లే రహే హై ( ఒక వ్యక్తి బాధను అనుభవిస్తుంటే.. ప్రతి ఒక్కరూ ఆనందాన్ని పొందుతారు ),” అని సిద్ధిఖీ చెప్పారు.
మరో సారి బదులిచ్చిన నవాజుద్దీన్.. “గండా ఆద్మీ ఆప్కో లల్కార్తా హై.. ఔర్ జబ్ ఆప్ ఉస్కే పాలే మే జాతే హై, వహా వో ఆప్సే స్మార్ట్ హోతా హై (ఒక చెడ్డ వ్యక్తి మిమ్మల్ని రెచ్చగొట్టి, దాదాపు వారి స్థాయికి తీసుకెళ్తాడు. మీ స్థాయిని దిగజార్చినందుకు అతను తెలివైనవాడినని సంతోషిస్తాడు.) కాబట్టి పుకార్లపై స్పందించకుండా ఉండటమే మంచిది.”
తర్వాతి ప్రాజెక్ట్..!
నవాజుద్దీన్ తదుపరి సినిమా భూమి పెడ్నేకర్తో కలిసి సుధీర్ మిశ్రా చిత్రం ఆఫ్వాలో కనిపించనున్నారు. ఇది మే 5, 2023న విడుదల చేయడానికి రెడీ అయ్యింది. ఆ తర్వాత, నేహా శర్మతో కలిసి కుషన్ నంది యొక్క జోగిర సారా రా రాలో కనిపించనున్నారు. ఈ చిత్రం మే 12, 2023న పెద్ద తెరపైకి రానుంది.