పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(prabhas) నటిస్తున్న సినిమాల్లో 'ప్రాజెక్ట్ కె(Project K)' పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ఎండింగ్‌కు వచ్చేసింది. రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. ఇలాంటి సమయంలో ప్రాజెక్ట్ కె సినిమాకు పొలిటికల్ సెగ అంటుకుందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. అసలు ప్రాజెక్ట్ కెకి ఏపి రాజకీయానికి ఏంటి సంబంధం?
మహానటి తర్వాత యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ చేస్తున్న సినిమా ప్రాజెక్ట్ కె(Project K). వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాడు. దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్‌తో పాన్ వరల్డ్ రేంజ్లో రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనే, దిశా పటానీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బిగ్ బి అమితాబ్ బచ్చన్ కీ రోల్ ప్లే చేస్తున్నారు. వచ్చే సంక్రాంతి కానుకగా.. జనవరి 12న ప్రాజెక్ట్ కెను రిలీజ్ చేయబోతున్నారు.
ఇలాంటి సమయంలో ప్రాజెక్ట్ కె రాజకీయంగా ఇబ్బంది పడనుందా? అనేది హాట్ టాపిక్‌గా మారింది. రీసెంట్గా ఏపీ ప్రభుత్వం(Ap Government) నంది అవార్డులను పట్టించుకోవడం లేదంటూ.. కొన్ని ఘాటైన విమర్శలు చేశాడు నిర్మాత అశ్వినీదత్(aswini dutt). దీన్ని వైకాపా నాయకులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఇదేదో తెలుగు దేశం పార్టీకి అనుకూలంగా మాట్లాడినట్టుగా వారు చెబుతున్నారు. దీంతో అశ్వినీదత్ కామెంట్స్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ కె పై పడనుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఖచ్చితంగా వైకాపా నాయకులు ప్రాజెక్ట్ కెని టార్గెట్ చేస్తారని సినీ అభిమానులు(fans) అంటున్నారు. గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలను సైతం వాళ్లు అలాగే టార్గెట్ చేశారనే టాక్ ఉంది.
దీంతో ఈసారి ప్రాజెక్ట్ కె(Project K) వంతు వచ్చిందని అంటున్నారు సినీ విశ్లేషకులు. అయితే అలా జరిగే ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయంటున్నారు. మరి ప్రాజెక్ట్ కె ఎలాంటి పొలిటికల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుందో చూడాలి.