పలాస(Palasa) హీరో రక్షిత్(Hero Rakshit) నటిస్తున్న తాజా చిత్రం నరకాసుర(Narakasura Movie). ఈ సినిమా నుంచి టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్(Teaser Release) చేసింది.
పలాస(Palasa) హీరో రక్షిత్(Hero Rakshit) నటిస్తున్న తాజా చిత్రం నరకాసుర(Narakasura Movie). సుముఖ క్రియేషన్స్, ఐడియల్ ఫిలిం మేకర్స్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నాయి. ఈ మూవీకి సెబాస్టియన్(SebaStiyan) దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్(Teaser Release) చేసింది. కొరియోగ్రాఫర్ విజయ్, యాక్షన్ డైరెక్టర్ రాబిన్ సుబ్బు మాట్లాడుతూ పలాస(Palasa Movie)లాగే ఈ సినిమా కూడా పెద్ద విజయం సాధిస్తుందని తెలిపారు. నిర్మాత శ్రీనివాస్ మాట్లాడుతూ సినిమాలోని నటీనటులంతా కూడా అద్భుతంగా చేశారన్నారు.
హీరోయిన్ సంకీర్తన(Heroine sankeerthana) మాట్లాడుతూ సినిమాలో తన పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందన్నారు. మరో హీరోయిన్ అపర్ణ మాట్లాడుతూ తాను వంద శాతం ఈ సినిమాకు కష్టపడ్డానని, తనకు టీమ్ నుంచి మంచి సపోర్టు దొరికిందన్నారు. ఈ మూవీలో చరణ్ రాజ్(Charan Raj), శ్రీమాన్, నాజర్ వంటి వారు నటించారు. చరణ్ రాజ్ మాట్లాడుతూ ఈ సినిమా ఒక మైల్ స్టోన్ అవుతుందన్నారు.
దర్శకుడు సెబాస్టియన్(Director SebaStiyan) మాట్లాడుతూ నరకాసుర సినిమా(Narakasura Movie)కు ఇంత గొప్ప అవుట్ ఫుట్ వస్తుందనుకోలేదన్నారు. తాను స్క్రిప్టు రాసుకున్నదంతా కూడా స్క్రీన్ పై చూపించేందుకు ఎక్కడా కాంప్రమైజ్ కాలేదన్నారు. నరకాసుర మూవీ(Narakasura Movie) జర్నీలో ఆర్టిస్టుల సహకారం మరువలేనిదన్నారు. హీరో రక్షిత్ సపోర్ట్ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువగానే ఉంటుందన్నారు. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామన్నారు. నరకాసుర మూవీ (Narakasura Movie) తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ్, మళయాళ, కన్నడ భాషల్లో విడుదల కాబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.