నేచురల్ స్టార్ నాని(Nani) రీసెంట్ గా దసరా(Dasara) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఆ సినిమా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే కలెక్షన్లను మాత్రం రాబట్టింది. దసరా సినిమాతో దర్శకుడు శ్రీకాంత్ కు విపరీతమైన క్రేజ్ పెరిగిందని చెప్పాలి. దసరా సినిమా తర్వాత నాని మరో సినిమా షూటింగ్ (Shooting)లో బిజీ అయిపోయాడు.
తాజాగా నాని(Nani) శౌర్యువ్ (Souryav) దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. నాని నటిస్తున్న 30వ సినిమాకు కొత్త డైరెక్టర్ శౌర్యువ్(Souryav) మంచి కథను రెడీ చేశాడు. ఇదొక ఫాదర్, డాటర్ సెంటిమెంట్ కథాంశంతో తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలై శరవేగంగా సాగుతోంది. ఈ మూవీకి సంబంధించి బిగ్ అప్ డేట్ ను చిత్ర యూనిట్ ప్రకటించింది.
ఈ ఏడాది క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 21వ తేదిన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు నాని ప్రకటించాడు. ఈ నేపథ్యంలో కొత్త సినిమా రిలీజ్ తేది(Movie Release Date)కి సంబంధించి ఓ స్పెషల్ పోస్టర్ ను కూడా పోస్టు చేశారు. ఆ పోస్టర్ లో నాని(Nani) ఓ పాపను హత్తుకుని ఉన్నట్లు కనిపిస్తోంది. ఆ పాపే సినిమాలో నాని కూతురుగా కనిపించనుందని తెలుస్తోంది. జెర్సీ(Jersy) సినిమా తర్వాత మళ్లీ అలాంటి ఎమోషనల్ కాన్సెప్ట్ తో నాని సినిమా చేస్తుండటంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీలో నానికి జోడీగా మృణాల్ ఠాకూర్(Mrunaal takur) కనిపించనుంది.