OG Shoot Begins: పవన్ ‘ఓజి’ వీడియో రిలీజ్.. తుఫాన్ మామాలుగా లేదుగా!
రన్ రాజా రన్‌తో మంచి హిట్ కొట్టాడు యంగ్ డైరెక్టర్ సుజీత్. అయితే సెకండ్ సినిమానే ప్రభాస్‌తో ఛాన్స్ అందుకున్నాడు. సాహో అంటూ డార్లింగ్‌ను పవర్ ఫుల్‌గా చూపించాడు. కానీ సాహో బాక్సాఫీస్ దగ్గర తేలిపోయింది. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుంటున్నాడేంటి.. అనుకుంటున్న సమయంలో బిగ్ అనౌన్స్మెంట్ ఇచ్చాడు. ఏకంగా పవర్ స్టార్‌తో ఛాన్స్ కొట్టేశాడు. మరి పవన్‌తో ఛాన్స్ అంటే మాటలు కాదు కదా.. అది కూడా అభిమాన హీరోని డైరెక్ట్ చేయడమంటే.. ఓజి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ పై నెక్స్ట్ లెవల్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి.
తాజాగా ఓజి నుంచి బ్లాసింగ్ వీడియోని రిలీజ్ చేశారు. ఇక ఈ వీడియో చూస్తే.. పవన్ ఫ్యాన్స్ ఈ ప్రాజెక్ట్ వచ్చే వరకు తట్టుకునేలా లేరు. They Call Him OG పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్.. తాజాగా మైంబైలో స్టార్ట్ అయ్యింది. నెక్స్ట్ వీక్ నుంచి పవన్ కళ్యాణ్ షూటింగ్లో జాయిన్ అవనున్నాడు. ఈ సందర్భంగా సాలిడ్ వీడియోని రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో సుజీత్, పవన్ స్టార్‌ని ఎలా చూపించబోతున్నాడు అనేది.. చిన్న గ్లిమ్ప్స్ ద్వారా చెప్పేశాడు. ముంబైలోని ప్రైవేటు పోర్ట్‌లో హై ఓల్టేజ్ పవర్ హౌజ్లా పవన్ ఎంట్రీ సీన్‌ను పేపర్ పై చూపిస్తూ.. A Fire Strom.. and its coming అంటూ.. పవన్ కళ్యాణ్‌ని OGగా ఇంట్రడ్యూస్ చేయబోతున్నట్టు ఇంట్రడక్షన్ సీన్‌ను రివీల్ చేశాడు.
ఈ వీడియోలో స్వోర్డ్స్, గన్స్, గ్రనైడ్స్, బుల్లెట్స్, పెన్స్, పేపర్స్.. ఇలా అన్నీ మా గ్యాంగ్ స్టర్ సినిమాలో ఉంటాయని చెప్పేశాడు సుజిత్. ఈ వీడియోకి తమన్ అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడు. అయితే ఇందులో ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్‌ను చూపించలేదు. కనీసం ఒక్క ఫ్రేమ్‌లో పవన్ కనిపించినా సోషల్ మీడియా షేక్ అయిపోయేది. మొత్తంగా ఓజికి సుజీత్ ఇచ్చిన హైప్ అయితే నెక్ట్స్ లెవల్ అనేలా ఉంది. ప్రస్తుతం పవన్ చేతిలో ఉన్న నాలుగు సినిమాల్లో.. రెండు రీమేక్‌లే ఉన్నాయి. వినోదయ సీతం, ఉస్తాద్ భగత్‌సింగ్ రెండు రీమేక్‌లు కాగా.. హరిహర వీరమల్లు, ఓజి స్ట్రెయిట్ సినిమాలు. వీటిలో ఓజి పై అంచనాలు పీక్స్‌కు వెళ్లిపోయాయి. మరి ఓజితో పవన్ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తారో చూడాలి.