సాహో, రాధేశ్యామ్ తర్వాత.. ప్రభాస్ నుంచి ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కే అనే సినిమాలు బ్యాక్ టు బ్యాక్ రాబోతున్నాయి. ఈ మూడు సినిమాలు భారీ బడ్జెట్‌తో.. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. వచ్చే ఏడాది జూన్ 16 ‘ఆదిపురుష్’ రిలీజ్ కానుండగా.. ‘సలార్’ సెప్టెంబర్ 28 విడుదల కానున్నట్టు గతంలోనే ప్రకటించాడు ప్రశాంత్ నీల్.
ఇక ప్రాజెక్ట్ కె 2024లో రిలీజ్ కానుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా.. పాన్ వరల్డ్ రేంజ్లో తెరకెక్కుతోంది. అయితే ఈ ప్రాజెక్ట్ సైన్స్ ఫిక్షన్ అని మాత్రమే తెలుసు. మధ్యలో ఏదో షూటింగ్ అప్టేట్తో పాటు.. అమితాబ్ బచ్చన్, ప్రభాస్‌కు సంబంధించిన ప్రీ లుక్ మాత్రమే రిలీజ్ చేశారు. అలాగే ఈ సినిమా అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో హాలీవుడ్ స్టాండర్డ్స్‌తో విజువల్ వండర్‌గా రాబోతోందని ముందు నుంచి వినిపిస్తోంది. ఇవి తప్పితే ఈ సినిమా కథేంటి..
సినిమా ఎలా ఉండబోతోంది అనే విషయాలపై క్లారిటీ లేదు. అయితే తాజాగా సరికొత్త అప్టేట్ ఇచ్చాడు నాగ్ అశ్విన్. ‘ఇది చాలా కొత్త సినిమా.. స్క్రిప్ట్ కూడా కొత్తది.. బిల్డప్ చేసే వరల్డ్, టెక్నిషియన్స్.. ఒక రకంగా ఈ సినిమా ఎలా చెయ్యాలి అన్నదానికే చాలా టైం పడుతుందని అన్నాడు.
అన్నీ కొత్తగా తయారు చేయాలి.. ‘మహానటి’ సినిమాకి కార్లు కావాలంటే రెంటుకు తీసుకురావచ్చని.. కానీ ఈ సినిమాకు అన్నీ మేమే తయారుచేసుకోవాలి.. మొత్తంగా ప్రాజెక్ట్ కె సరికొత్తగా ఉంటుందని’ అన్నాడు. ప్రస్తుతం నాగ్ అశ్విన్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.