»Nabha Natesh Is Shining Like A Hot Chilli In A Red Lehenga
Nabha Natesh: రెడ్ లెహంగాలో హాట్ చిల్లీలా మెరిసిపోతున్న నభా నటేష్..!
కన్నడ బ్యూటీ నభా నటేష్ స్పెషల్ గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె తన అందాలతో ఎప్పుడో అందరి మనసులను దోచేసింది. మోడల్ గా కెరీర్ మొదలుపెట్టిన ఈ బ్యూటీ చాలా తక్కువ కాలంలోనే హీరోయిన్ గా గుర్తింపు సాధించింది. కన్నడలో వరస ఆఫర్లు రావడంతో ఈ బ్యూటీ పై టాలీవుడ్ దర్శకుల కన్ను పడింది.
టాలీవుడ్లో ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమై, అందరి దృష్టిని నభా నటేష్ (Nabha Natesh) ఆకర్షించింది. ఆ తర్వాత వరసగా ఆఫర్లు క్యూ కట్టాయి. ఇస్మార్ట్ శంకర్ లో అయితే అదరగొట్టేసింది. అందం, నటన విషయంలో తనకు తిరుగలేదని నిరూపించుకుంది. ఆ మూవీలో తన లోని గ్లామర్ డోస్ ని పరిచయం చేసింది. ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో బ్యూటీ ఆఫర్లు క్యూ కట్టినట్లే అని అందరూ అనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయ్యింది. అవకాశాలు తగ్గిపోయాయి. రావడానికి కొన్ని ఛాన్సులు వచ్చాయి కానీ, పెద్దగా క్లిక్ అవ్వలేదు.
అయినా, ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన అభిమానులను అలరించడంలో ఎప్పుడూ ముందుంటుంది. తాజాగా ఆమె చేసిన హాట్ ఫోటో షూట్ చూసి అందరూ నోరెళ్ల పెడుతున్నారు. తాజాగా రెడ్ కలర్ లెహంగాలో కనిపించింది. ఈ లెహంగాలో ఆమె రెడ్ మిర్చీలా సూపర్ హాట్ గా కనపడుతోంది. ఆ లెహంగాకి కరెక్ట్ గా సెట్ అయ్యేలా ఆమె జ్యూవెలరీ ధరించడం విశేషం. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట ఆకట్టుకుంటున్నాయి.