అమీర్ ఖాన్, ఫాతీమా సనా షేక్ రిలేషన్షిప్ గురించి బాలీవుడ్ క్రిటిక్ ఉమేర్ సంధూ దారుణంగా కామెంట్లు చేశాడు. ప్రస్తుతం ఆ కామెంట్లు నెట్టింట్లో వైరల్ గా మారాయి.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న ఫాతిమా సనా షేక్ తో(Fatima Sana Shaikh) హీరో అమీర్ ఖాన్(Amir khan) డేట్ చేస్తున్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు ఆ ప్రేమ కూడా బ్రేకప్ కి దారితీసిందట. తన రెండో భార్య కిరణ్ రావుతో విడిపోయిన తర్వాత ఈ ఫామితా సనాతో ఆయన రిలేషన్ మొదలుపెట్టారు. అసలు, కిరణ్ రావుతో విడాకులు కారణం దంగల్ ఫేమ్ ఫాతీమా సనా షేక్లో అమీర్ ఖాన్కు ఉన్న అఫైర్ అనే వార్తలు మీడియాలో భారీగా ట్రెండ్ అయ్యాయి. పలుమార్లు వారిద్దరు కలిసి కూడా కనిపించడం మీడియా వార్తలకు బలం చేకూరింది. అయితే ఈ రూమర్లపై అమీర్ గానీ, సనా ఫాతీమా షేక్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ వారి అఫైర్ గురించి వార్తలు మాత్రం గుప్పు మంటూనే ఉన్నాయి.
అయితే అమీర్ ఖాన్, ఫాతీమా సనా షేక్ రిలేషన్షిప్ గురించి బాలీవుడ్ క్రిటిక్ ఉమేర్ సంధూ దారుణంగా కామెంట్లు చేయడం చర్చనీయాంశమైంది. వ్యక్తిగత అభిప్రాయ బేధాలు తలెత్తడంతో అమీర్, సనా కొట్టుకొన్నారు. సనాకు తగిన సమయం ఇవ్వడం లేదనే కారణంతో వారి మధ్య గొడవలు వచ్చాయి. వారిద్దరి మధ్య బ్రేకప్ జరిగింది అని సనా స్నేహితుడు తెలిపారని ఉమేర్ సంధూ తన ట్వీట్లో పేర్కొన్నారు. ఇందులో నిజం ఎంత ఉందో తెలీదు కానీ, ఈ వార్త మాత్రం ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇదిలా ఉండగా, అమీర్ ఖాన్ చివరగా లాల్ సింగ్ చద్దా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే, ఆ మూవీ పెద్దగా ఆకట్టుకోలేదు. ఆ తర్వాత ఆయన ఏ సినిమా అంగీకరించలేదు.