Aamir khan marriage: కూతురు వయసున్న హీరోయిన్‌తో అమీర్ ఖాన్ పెళ్లి!?
బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్(aamir khan) గురించి అందరికీ తెలిసిందే. అయితే సినిమాల పరంగా మిస్టర్ పర్ఫెక్ట్ అనిపించుకున్న అమీర్ ఖాన్.. పర్సనల్ లైఫ్‌లో మాత్రం పర్ఫెక్ట్గా ఉండలేకపోయాడనే చెప్పాలి. ఇప్పటికే ఇద్దరికీ విడాకులు ఇచ్చేశాడు అమీర్. ఇక ఇప్పుడు ఊహించని విధంగా కూతురు వయసులో ఉన్న హీరోయిన్ను పెళ్లి(marriage) చేసుకునేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.
చివరగా ‘లాల్ సింగ్ చడ్డా’ సినిమాతో మెప్పించలేకపోయినా అమీర్ ఖాన్(aamir khan). కొన్నాళ్లు సినిమాలకు గ్యాప్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎప్పుడుంటుందో ఇప్పుడే చెప్పలేం. అయినా కూడా అమీర్ ఖాన్ వార్తల్లో నిలుస్తునే ఉన్నాడు. 1986లో రీనా దత్తను పెళ్లి చేసుకున్న అమీర్…2002లో ఆమెకులు విడాకులు ఇచ్చాడు.
ఆ తర్వాత 2005లో కిరణ్ రావును పెళ్లి చేసుకున్నాడు. అయితే 2021లో ఆమెకు విడాకులు ఇచ్చేశాడు. ప్రస్తుతం అమీర్ ఖాన్ ఒంటరిగానే ఉంటున్నాడు. కాకపోతే ఓ యంగ్ బ్యూటీతో మాత్రం డేటింగ్లో ఉన్నట్టు వార్తలు వస్తునే ఉన్నాయి. అమీర్ ఖాన్ సూపర్ హిట్ మూవీ ‘దంగల్’లో కూతురి పాత్రలో నటించింది ఫాతిమా సనా షేక్(fatima sana shaikh). ఈ బ్యూటీతోనే అమీర్ ఖాన్ ప్రేమలో ఉన్నాడనేది బీ టౌన్ టాక్.
అసలు ఈమె వల్లే కిరణ్ రావుకు విడాకులు ఇచ్చాడనే టాక్ ఉంది. ఈ క్రమంలో త్వరలోనే ఈ ఇద్దరు పెళ్లి చేసుకో బోతున్నట్టు బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ప్రస్తుతం అమీర్ ఖాన్ వయసు 58.. సనా షేక్ వయసు 31. ఈ ఇద్దరి ఏజ్ గ్యాప్ 27.. అయితే అమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ ఏజ్ 26.. దీంతో కూతురు వయసున్న అమ్మాయితో అమీర్ ఖాన్ మ్యారేజ్(marriage) అనే న్యూస్.. ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అసలు ఇందులో నిజమెంతో తెలియదు కానీ.. వీళ్ల లవ్ మ్యాటర్ మాత్రం వైరల్ అవుతోంది.