నిజమే.. స్టార్ హీరోలు, హీరోయిన్లను ఓ ఆట ఆడుకుంటున్నాడు ఓ వ్యక్తి. అయినా కూడా అతన్ని ఏం చేయలేకపోతున్నారు స్టార్ హీరోలు, హీరోయిన్లు. అతను చేసే ట్వీట్స్ సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్‌గా మారుతుంటాయి. అది కూడా ఎలా పడితే అలా ట్వీట్స్ చేస్తుంటాడు. ఎవ్వరైనా సరే అతని ట్వీట్‌కు బలి అవాల్సిందే. బూతులతో ఫ్యాన్స్ చుక్కలు చూపించినా కూడా.. తగ్గేదేలే అంటాడు అతగాడు. తాజాగా పూజా హెగ్డే, కృతి సనన్ పై చేసిన పనికి కామెడీగా ట్వీట్స్ చేస్తున్నాడు.
బాలీవుడ్ హీరోలు, హీరోయిన్లు ఏం చేస్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? ఎవరు ఎవరితో డేటింగ్ చేస్తున్నారు? రిలీజ్‌కు ముందే ఆ సినిమా హిట్, ఈ సినిమా ఫట్.. ఇలా ఒక్కటని కాదు, ఏది పడితే ట్వీట్స్ చేస్తుంటాడు ఉమైర్ సంధు(Umair Sandhu) అనే వ్యక్తి. ఇతగాడు తనను తాను గత కొన్నేళ్లుగా ఓవర్సీస్ సెన్సార్ మెంబర్ అని, రివ్యూయర్ అని చెప్పుకుంటూ ఉంటాడు ఉమైర్. అందుకే హీరోలు, హీరోయిన్లకు మండిపోయేలా ట్వీట్స్ చేస్తుంటాడు. వాటిని పెద్దగా ఎవ్వరు పట్టించుకోకపోయినా కూడా ఆ ట్వీట్స్ వైరల్ అవుతుంటాయి.
ఒక్క బాలీవుడ్ అనే కాదు సౌత్ హీరోలపై కూడా అతను ఏదో ఒక ట్వీట్ చేస్తుంటాడు. ఆ మధ్య ప్రభాస్-కృతిసనన్‌ని ప్రపోజ్ చేశాడని, ఇద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ నడుస్తోందని సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు. అలాగే బుట్టబొమ్మ పూజాహెగ్డేని కూడా వదల్లేదు. పూజా ఫ్లాప్ బ్యూటీ, ఐరన్ లెగ్ అంటూ ఆ మధ్య ట్వీట్స్ చేశాడు. ఈ ఇద్దరే కాదు చాలామందిపై ఇలాంటి ట్వీట్స్ చేశాడు. కానీ కృతిసనన్, పూజాహెగ్డే మాత్రం అతనికి లీగల్ నోటీసులు పంపించారు. దీన్ని కూడా ఉమైర్ సంధు(Umair Sandhu) ట్టిట్టర్లో షేర్ చేసుకున్నాడు.
కృతి సనన్, పూజా హెగ్డే తనకు నోటీసులు పంపించినట్టుగా కామెడీగా ట్వీట్స్ చేశాడు. ప్రస్తుతం ఇవి కూడా వైరల్‌గా మారాయి. అయితే అతడు లండన్‌లో ఉంటున్నాడు. అందుకే ఓవర్సీస్ సెన్సార్ మెంబర్ అని చెబుతుంటాడు. కాబట్టి అతనికి ఎన్ని లీగల్ నోటీసులు పంపించినా ఎలాంటి యాక్షన్ తీసుకోవడానికి కుదరదనే చెప్పాలి. అందుకే ఉమైర్ సంధు(Umair Sandhu) ట్వీట్స్‌కు అడ్డు అదుపు లేదనే చెప్పొచ్చు. ఏదేమైనా ఈయన మాత్రం స్టార్స్ గురించి కాంట్రవర్శీ ట్వీట్స్ చేస్తూ ఫాలోయింగ్ పెంచుకునే పనిలో ఉన్నాడు.