»Jailer Is Coming For The First Time In History Two Films With The Same Title
Rajanikanth:’జైలర్’ వస్తున్నాడు..చరిత్రలో తొలిసారి ఒకే టైటిల్‌తో రెండు సినిమాలు
చరిత్రలో తొలిసారి ఒకే టైటిల్‌తో రెండు సినిమాలు ఒకే రోజు విడుదల కానున్నాయి. రజినీ కాంత్ నటిస్తున్న 'జైలర్' టైటిల్ తోనే మలయాళం ఇండస్ట్రీలో మరో సినిమా విడుదల కానుంది.
సూపర్ స్టార్ రజినీకాంత్ (RajaniKanth) ‘జైలర్’ మూవీ (Jailer Movie)తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అయితే ఇదే టైటిల్‌తో అదే రోజు మరో సినిమా కూడా రానుండటం విశేషం. ఇప్పటి వరకూ ఒకే టైటిల్‌తో రెండు మూడు సినిమాలు రావడం మనం చూసుంటాం. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ ‘అడవిరాముడు’ పేరుతో సినిమా తీస్తే ప్రభాస్ (Prabhas) కూడా ఆ టైటిల్‌తో మూవీ చేశాడు. ఆ తర్వాత ఏఎన్నార్ ‘శ్రీమంతుడు’ మూవీ టైటిల్‌తో మహేష్ బాబు (Mahesh Babu), కొరటాల సినిమా వచ్చింది.
మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ‘గ్యాంగ్ లీడర్’ తీస్తే నాని (Nani) అదే టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇలా చెబుతూ పోతే చాలా సినిమాలే ఈ లిస్ట్‌లో ఉన్నాయి. అయితే ఇప్పుడు మాత్రం అలా జరగలేదు. ఒకేసారి ఒకే టైటిల్‌తో రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. జైలర్ అనే టైటిల్ (Jailer Movie)తోనే ఈ సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చి సందడి చేయనున్నాయి.
సాధారణంగా పాత సినిమా టైటిల్ పెట్టుకోని మూవీ తీయాలంటే పదేళ్లు పూర్తి కావాలి. అంటే ఒక టైటిల్‌తో సినిమా రావడానికి కనీసం 9 ఏళ్ల గ్యాప్ అనేది ఉండాలి. కానీ ఒకే టైటిల్‌తో రెండు సినిమాలు ఒకేసారి విడుదల కావడం సినీ ఇండస్ట్రీల చరిత్రలోనే ఇప్పటి వరకూ జరగలేదు. రజినీ కాంత్(Rajanikanth) హీరోగా నెల్సన్ దర్శకత్వంలో తెరకెక్కిన జైలర్ సినిమా (Jailer Movie) ఆగస్టు 11వ తేదిన విడుదల కానుంది. అదే రోజు అదే ‘జైలర్’ అనే టైటిల్‌తో మలయాళంలో కూడా ఓ మూవీ రిలీజ్ కానుంది. ధ్యాన్ శ్రీనివాసన్ (Dhyan Srinivas) అనే మాలీవుడ్ యాక్టర్ మలయాళంలో తెరకెక్కిన జైలర్ సినిమాలో నటించారు. ఈ సినిమా ఈ టైటిల్ ప్లస్ కానుంది. ఇండియా వైడ్‌గా ఈ టైటిల్ ఇప్పుడు ట్రెండ్ అవుతోంది.