»Pooja Hegde And Kriti Sanon Legal Notices To Umair Sandhu
Umair Sandhu: తప్పుడు వార్తలు..ఉమైర్ సంధుకి పూజా నోటీసులు!
తానొక మూవీ క్రిటిక్ అంటూ చెప్పుకుంటూ తిరిగే ఉమైర్ సంధు పేరు వినే ఉంటారు. ఇండియాలో ఏదైనా మూవీ విడుదల కాకముందే, మూవీ ఇలా ఉంది, అలా ఉంది అంటూ కామెంట్స్ చేస్తూ ఉంటాడు. అయితే చాలా వరకు ఆయన సినిమా అద్భుతం అని చెప్పగానే, ఆ మూవీ ప్లాప్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఇక ఆయన సినిమా బాలేదు అని రివ్యూ ఇచ్చినవి బ్లాక్ బస్టర్ అయినవీ కూడా ఉన్నాయి. ఆయన చెప్పిన రివ్యూ నిజమైన సందర్భాలు చాలా తక్కువ.
ఉమైర్ సంధు(Umair Sandhu) పలు రకాల వ్యాఖ్యలు చేయడం వల్ల కొంత కాలం తర్వాత ఆయన రివ్యూలను అందరూ నమ్మడం మానేశారు. అయితే ఈ మధ్య రివ్యూలు పక్కన పెట్టి, స్టార్ హీరోయిన్ల గురించి అసభ్యంగా కామెంట్స్ చేయడం మొదలుపెట్టాడు. వారి పర్సనల్ విషయాల్లో ఎలాంటి నిజం ఉందో, లేదో తెలుసుకోకుండా కామెంట్స్ చేస్తూ వస్తున్నాడు. ఇప్పటి వరకు చాలా మంది హీరోయిన్లపై ఇలాంటి కామెంట్స్ చేశాడు. దీనిలో భాగంగానే ఆయన ఇటీవల టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే(Pooja Hegde) పై కొన్ని కామెంట్స్ చేశాడు. సినిమాల్లో అవకాశాలు లేకపోవడంతో పూజా హెగ్డే నిరాశకు గురయ్యిందని, ఇటీవల ఆత్మహత్యకు కూడా ప్రయత్నించిందని, అయితే, కుటుంబ సభ్యులు కాపాడారని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ చాలా దుమారం రేపింది.
అయితే ఆయన ట్వీట్ పై పూజా చాలా సీరియస్ అయినట్లు తెలుస్తోంది. వెంటనే ఆయనకు నోటీసులు జారీ చేసింది. అయితే, ఈ విషయాన్ని కూడా ఆయన ట్విట్టర్ లో షేర్ చేయడం విశేషం. గతంలో కృతి సనన్( kriti Sanon) పై కూడా ఇలాంటి కామెంట్సే చేశాడు. ప్రభాస్ తో విడిపోయింది అంటూ కామెంట్స్ చేశాడు. దీనిపై ఆమె కూడా నోటీసులు పంపడం విశేషం. అయితే నోటీసుల భయం లేకుండా ఆయన వాటిని కూడా షేర్ చేస్తుండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. గతంలో దీపికా పదుకొణే పై కూడా ఇలాంటి కామెంట్స్ చేశాడు. దీపికా బ్యాగ్ లో కొకైన్ దొరికిందని, దాని నుంచి బయటపడటానికి చాలా డబ్బులు ఇచ్చిందని కామెంట్స్ చేయడం గమనార్హం.