మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫిల్మ్ ‘గాడ్‌ఫాదర్’.. దసరా పండుగ కానుకగా అక్టోబర్ 5న రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో అనంతపురంలో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్లో భారీ వర్షంలోను మాసివ్ స్పీచ్‌తో అదరగొట్టారు మెగాస్టార్. ఎన్నో అంశాలు పంచుకున్న చిరంజీవి.. అభిమానుల గురించి చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి. తన గుండె లోతుల్లో నుంచి చెప్తున్నా మాటలు ఇవని.. తనకు ఇండస్ట్రీలో రావడానికి ఏ గాడ్ ఫాథర్ లేకపోవచ్చు.. కాని ఇప్పటివరకు ఆదరిస్తూ వచ్చిన అభిమానులే తన గాడ్ ఫాథర్స్ అని ఉద్వేగానాకి లోనయ్యారు మెగాస్టార్. మొత్తంగా పవర్ ఫుల్ డైలాగ్స్‌తో చిరంజీవి స్పీచ్ హైలైట్‌గా నిలిచిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ వేడుకలో రిలీజ్ చేసిన ‘గాడ్ ఫాదర్’ ట్రైలర్ మెగా ట్రీట్ ఇచ్చేలా ఉందంటున్నారు. మెగాస్టార్ ఇమేజ్‌కు తగ్గట్టుగా.. పూరి జగన్నాథ్ వాయిస్‌తో మొదలైన ట్రైలర్.. పవర్ఫుల్ డైలాగులు, పవర్ పంచ్‌లు, యాక్షన్ సీన్స్‌తో పక్కా యాక్షన్ ఎంటర్టైనర్గా సాగింది. ఇక ఈ ట్రైలర్లో సల్మాన్ స్పెషల్ అప్పియరెన్స్‌ను స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. దాంతో ఈ ట్రైలర్‌కి అద్దిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. గంటల్లోనే 6 మిలియన్స్‌కి పైగా వ్యూస్ రాబట్టి.. యూ ట్యూబ్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది గాడ్ ఫాదర్ ట్రైలర్. దాంతో ఈ దసరాకు మెగాభిమానులకు మాసివ్ ట్రీట్ ఖాయమంటున్నారు. మరి అంచనాలను పెంచేస్తున్న ‘గాడ్ ఫాదర్’ ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి.