Samantha: సమంత పై ఎన్నో డౌట్స్.. ఆమె పక్కన ఉన్నది ఎవరు?
స్టార్ బ్యూటీ సమంత గురించి అందరికీ తెలిసిందే. కెరీర్ పీక్స్‌లో ఉండగానే నాగచైతన్యను పెళ్లి చేసుకుంది అమ్మడు. కొన్నాళ్లు హ్యాపీగా సంసార జీవితాన్ని గడిపిన చై, సామ్.. ఊహించని విధంగా విడాకులు తీసుకున్నారు. అసలు వీళ్లు ఎందుకు విడిపోయారనే దానిపై ఇప్పటికీ ఎన్నో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కానీ అసలు మ్యాటర్ మాత్రం బయటికి రాలేదు. అయితే ప్రస్తుతం సమంత ఒంటరిగానే ఉంటుందా? ఒకవేళ ఉంటే.. ఆమె పక్కన కనిపిస్తున్న వ్యక్తి ఎవరు? అనేదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది
డివోర్స్ తర్వాత సమంత(Samantha), నాగ చైతన్య ఎవరి దారి వాళ్లు చూసుకున్నారు. ప్రస్తుతం సమంత పలు భారీ ప్రాజెక్ట్స్‌తో దూసుకుపోతోంది. కానీ ఆ మధ్య మయో సైటిస్ అనే వ్యాధి బారిన పడింది. దాంతో చావు అంచుల వరకు వెళ్లి వచ్చానని కన్నీళ్లు పెట్టుకుంది సామ్. ఈ మధ్యే సమంత పూర్తిగా కోలుకుంది. ఇప్పుడు గ్యాప్ లేకుండా షూటింగ్లో పాల్గొంటోంది. బాలీవుడ్లో రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో ‘సిటాడెల్’ అనే వెబ్ సిరీస్ చేస్తోంది. తెలుగులో విజయ్ దేవరకొండ సరసన ‘ఖుషి’ సినిమాలో నటిస్తోంది.
ఇదిలా ఉంటే.. ఈ మధ్య సోషల్ మీడియాలో సమంత షేర్ చేస్తున్న ఫోటోల్లో ఓ వ్యక్తి హైలెట్‌గా నిలుస్తున్నాడు. గత కొన్ని రోజులుగా సామ్(Samantha) ఎక్కడ ఉంటే.. అతను కూడా అక్కడే ఉంటున్నాడు. అసలు అతను ఎవరు? అతని పేరేంటి? ఈ ఇద్దరి మధ్య ఉన్న రిలేష్ ఏంటి? ఫ్రెండా లేక బాయ్ ఫ్రెండా? అనే డౌట్స్ వస్తున్నాయి. ఆ మధ్య సమంత 36వ బర్త్ డే వేడుకలను గ్రాండ్‌గా జరుపుకుంది. ఈ సెలబ్రేషన్స్‌లో సమంత చేత పట్టు బట్టి మరీ కేక్ కట్ చేయించాడు ఆ వ్యక్తి. చూడ్డానికి బాలీవుడ్ హీరోలా లైట్ బియర్డ్‌తో కనిపిస్తున్న ఆ వ్యక్తిపై అప్పటి నుంచే అనుమానాలు మొదలయ్యాయి.
ఇక ఈ మధ్య సమంత షేర్ చేస్తున్న ఫోటోల్లో కామన్‌గా కనిపిస్తున్నాడు. రీసెంట్గా జిమ్‌లో సామ్(Samantha)తో వర్కౌట్స్ చేయిస్తూ కనిపించాడు. దీంతో ఇతను సమంతతో చాలా క్లోజ్‌గా మూవ్ అవుతున్నట్టే కనిపిస్తోంది వ్యవహారం. తాజాగా సామ్ వెకేషన్ ఫొటోస్లోను అతను కనిపించడంతో.. అనుమానాలు ఎక్కువవుతున్నాయి. కానీ ఇప్పటి వరకు సమంత అతనెవరనేది ఎక్కడా ప్రస్తావించలేదు. అయితే అతని పేరు హిమాంక్ దువ్వురు అని సోషల్ మీడియా వర్గాలు చెబుతున్నాయి. అతని ఇన్‌స్టా అకౌంట్ ప్రైవేట్ మోడ్‌లో ఉంది. దీంతో సమంత పై ఎన్నో డౌట్స్ పుట్టుకొస్తున్నాయి. అయినా సమంత మాత్రం ఫుల్లుగా ఎంజాయ్ చేస్తోంది. మరి సామ్ పక్కన ఉన్నది ఎవరో తెలియాలంటే.. అమ్మడు స్వయంగా నోరు విప్పే వరకు వెయిట్ చేయాల్సిందే. ఈలోపు అనవసరపు అనుమానాలు వద్దనే చెప్పాలి.