Tamannaah: ఆ సీన్స్ కలిసే చూడండి.. తమన్నా పై ట్రోలింగ్!
ఒకప్పటి తమన్నా వేరు.. ఇప్పుడు చూస్తున్న తమన్నా వేరు.. అనడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. అసలు తమన్నాలో ఇంత మార్పు చూడలేదని.. ఇండస్ట్రీలోకి వచ్చి రెండు దశాబ్దాలు కావొస్తున్నా.. ఇంత హాట్‌గా చూడలేదని అంటున్నారు నెటిజన్స్. ప్రస్తుతం తమన్నా బాలీవుడ్లో వరుస వెబ్ సిరీస్‌లు చేస్తూ దూసుకుపోతుంది. ఈ క్రమంలో తమన్నా చేసిన కామెంట్స్ పై ట్రోలింగ్ ఓ రేంజ్లో జరుగుతోంది.
రీసెంట్గా తమన్నా నటించిన ‘జీ కర్థ’ అనే వెబ్ సిరీస్ సంచలనంగా నిలిచిన సంగతి తెలిసిందే. అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ సిరీస్‌లో రొమాంటిక్ సీన్స్‌లో రెచ్చిపోయింది తమన్నా. ఇక ఈ వేడి చల్లారకముందే.. మరో సెన్సేషన్ వెబ్ సిరీస్‌తో రాబోతోంది అమ్మడు. అప్పట్లో సంచలనంగా నిలిచిన లస్ట్ స్టోరీస్ సిరీస్‌కు వస్తున్న సీక్వెల్.. ఈ నెల 29 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో తన ప్రియుడు విజయ్ వర్మతో కలిసి రెచ్చిపోయింది తమన్నా. తాజాగా ఈ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా తమన్నా చేసిన కామెంట్స్.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఇప్పటికే ‘జీ కర్థ’ సిరీస్‌తో చెమటలు పట్టించిన తమన్నా.. ఈ బోల్డ్ సిరీస్‌లో ఇంకెంతగా రెచ్చిపోయిందో అనే టాక్ నడుస్తోంది. దీంతో ఫ్యామిలీతో కలిసి ఈ సిరీస్‌ను చూడడం కష్టమని ఫిక్స్ అయిపోయారు ఓటిటి లవర్స్. కానీ తమన్నా మాత్రం ఈ వెబ్ సిరీస్ చూసేప్పుడు ఎవరైనా వస్తే.. మధ్యలోనే ఆపేయాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చింది. ఈ సిరీస్ ప్రమోషన్ వీడియోలో.. ‘లస్ట్ అనే పేరు చూసి ఎవ్వరు భయపడకండి. ఈ సిరీస్ చూసేటప్పుడు ఎవరైనా వస్తే.. కంగారు పడకండి. సిరీస్‌ను మధ్యలోనే ఆపేయకండి. అందరితో కలిసి దీన్ని చూడవచ్చు.
అలా చూస్తే ఏమవుతుంది.. తప్పేమి లేదు, తుఫానేమీ రాదు, ఆకాశం ఏమి ఊడి పడదు. మరెందుకు భయం.. రిలాక్స్ అవుతూ కూల్‌గా ఈ సిరీస్‌ను చూడండి’ అని చెప్పుకొచ్చింది. దీంతో.. ఇంత హాట్‌గా కనిపిస్తూ.. కూల్‌గా సిరీస్ చూడమంటే ఎలా తమన్నా? అంటూ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. మీ మనసులో ఇలాంటి సినిమాల గురించి ఎలాంటి అభిప్రాయం ఉందో తెలియదు, కానీ భారతీయ కుటుంబాలలో, మేము మా కుటుంబాలతో అలాంటి వాటిని చూడము, చూడలేము.
అసలు మీరు సినిమాల్లో బోల్డ్, కిస్సింగ్ సీన్లు చేయడం మానేయండి. వాటిని ఫ్యామిలీ ఫిల్మ్‌లుగా ప్రమోట్ చేయడం మానేయండి.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరు.. ‘మీ సిరీస్‌తో కథలను ఎవరు పట్టించుకుంటారు. మీ హాట్ సీన్స్ కోసమే చూస్తారు.. ఇలాంటి ప్రమోషన్స్‌ని ఎవరూ పట్టించుకోవడం లేదు.. అని అంటున్నారు. మరి ఈ సిరీస్ రిలీజ్ అయ్యాక.. ఇంకెన్ని కామెంట్స్ చేస్తారో చూడాలి.