ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య అమ్మాయిల గురించి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఎవరు కరెక్టో.. ఎవరు రాంగో చెప్పడం కష్టమని.. కానీ అమ్మాయిలదే తప్పని చెప్పుకొచ్చారు. అయితే దీనికి అసలు కారణం వేరే ఉంది. ఆ మధ్య జరిగిన ఓ సంఘటన నేపథ్యంలో నాగ శౌర్య ఇలాంటి కామెంట్స్ చేశాడు.
హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు యంగ్ హీరో నాగ శౌర్య(Naga Shaurya). గత కొద్ది రోజులుగా వైవిధ్యంగా సినిమాలు చేస్తునే ఉన్నాడు. కానీ ఒక్క హిట్ కూడా పడడం లేదు. చివరగా ఫలానా అమ్మాయి ఫలానా అబ్బాయి అనే సినిమాతో ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు. అయితే ఆ సినిమా రిలీజ్ సమయంలో.. రోడ్డుపై ఒక అమ్మాయిని కొడుతుండగా వెళ్లి అడ్డు పడ్డాడు నాగ శౌర్య. ఆ వీడియో క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అసలు ఈయన లవర్స్ మధ్యలోకి ఎందుకు వెళ్లాడు? అనేది హాట్ టాపిక్‌గా మారింది.
తాజాగా ఈ వీడియో పై క్లారిటీ ఇచ్చాడు నాగ శౌర్య(Naga Shaurya). తన లేటెస్ట్ మూవీ ‘రంగబలి’ సినిమా జూలై 7న రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో.. నాగ శౌర్యకు వైరల్ వీడియోకి సంబంధించిన క్వశ్యన్ ఎదురైంది. రీసెంట్గా ఒక అబ్బాయి రోడ్డుపైన అమ్మాయిని కొడుతుంటే.. మీరు వెళ్లి కొట్టారు కదా? అంతలా రియాక్ట్ కావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అసలేం జరిగింది? అని అడిగారు.
దానికి సమాధానంగా.. ‘నిజం చెప్పాలంటే అతన్ని నేను కొట్టలేదు. నేను ఓ పనిమీద కూకట్‌పల్లికి వెళ్తున్నా.. రోడ్డుమీద ఓ అమ్మాయిని అబ్బాయి కొడుతుండడం చూసి.. వెళ్ళి వారించాను. కానీ ఆ అమ్మాయి నా లవర్ కొడతాడు.. తిడతాడు.. మధ్యలో నీకేంటి అని రివర్స్ అయిందని’ అన్నాడు. ఈ విషయంలో ఆ అమ్మాయిదే తప్పు. నేను పోలీసు కంప్లయిట్ ఇద్దామనుకున్నా. కానీ నన్ను చంపినా పర్వాలేదు. వాడే నా మొగుడు అని చెప్పడంతో.. నాకేం చేయాలో అర్థంకాలేదు. ఈ మధ్య అమ్మాయిలు ఇలాగా మారిపోయారా అని ఆశ్చర్యపోయా. అయితే దీన్ని కొందరు నేను పబ్లిసిటీ కోసం ప్లాన్ చేశారని అన్నారు.. కానీ అందులో వాస్తవం లేదు.. నిజంగా వాళ్లెవరో నాకు తెలియదు అన్నారు. దీంతో నాగ శౌర్య(Naga Shaurya) వైరల్ వీడియో పై క్లారిటీ వచ్చేసినట్టేనని చెప్పొచ్చు.