»Asin Thottumkal Sparks Divorce Rumours After She Deletes Husband Rahul Sharmas Photos From Instagram
Actress Asin: భర్తతో అసిన్ విడాకులు తీసుకుందా..? అందుకే అలా చేసిందా?
ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన వారిలో అసిన్ కూడా ఒకరు. తెలుగులో అమ్మ, నాన్న, ఓ తమిళ అమ్మాయితో అందరి దృష్టి ఆకర్షించింది. ఇక సూర్య గజినీతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. నాగార్జున, వెంకటేష్ వంటి హీరోలతోనూ నటించింది ఆకట్టుకుంది. కెరీర్ బాగున్న సమయంలోనే ఆమె సినిమాలకు దూరమయ్యింది.
హీరోయిన్ అశిన్(Actress Asin).. ఓ ప్రముఖ వ్యాపారవేత్త రాహుల్ శర్మను ప్రేమించి పెళ్లాడింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన ఆమె, హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ ని లీడ్ చేస్తోంది. అయితే, చాలా కాలం తర్వాత ఆమె వార్తల్లోకి ఎక్కారు. అసిన్ తన భర్త నుంచి విడాకులు తీసుకుంటోంది అంటూ ప్రచారం మొదలైంది. దానికి కారణం కూడా లేకపోలేదు. సోషల్ మీడియాలో పెద్ద గా అసిన్ యాక్టివ్ గా ఉండదు. ఆమె తన ఫోటోలను సైతం చాలా అరుదుగా షేర్ చేస్తూ ఉంటుంది. అలాంటిది సడెన్ గా తన ఇన్ స్టాగ్రామ్ నుంచి ఫోటోలను డిలీట్ చేసింది. తన పెళ్లి ఫోటోలు, భర్త ఫోటోలను డిలీట్ చేసింది. అంతే, సడెన్ గా ఆమె భర్త ఫోటోలు తొలగించడంతో, ఆమె విడాకులు తీసుకుంటోందంటూ ప్రచారం మొదలైంది.
అయితే, ఆమె ఫ్యాన్స్ మాత్రం ఈ వార్తలను తోసిపుచ్చుతున్నారు. అసిన్(Actress Asin) గతంలోనూ ఇలా చేసిన సందర్భాలు ఉన్నాయని వారు వాదిస్తున్నారు.ఆమె విడాకులు తీసుకోలేదని, భర్తతోనే ఉన్నారని వారు కామెంట్స్ చేస్తున్నారు. అయితే, ఆమె తన భర్త అన్ని ఫోటోలు తొలగించినప్పటికీ, వారి పెళ్లి రిసెప్షన్ ఫోటో మాత్రం అలానే ఉంచారు. అందులో బాలీవుడ్ దివంగత నటుడు రిషి కపూర్ కూడా ఉన్నారు. ఆయనతో కలిసి దిగిన ఫోటోల్లో ఆమె భర్త కూడా ఉన్నారు. ఆ ఒక్క ఫోటో మాత్రం ఆమె అలానే ఉంచడం విశేషం.