»Manchu Manoj Emotional On Her Sister Manchu Lakshmi Prasanna
Manchu Manoj ‘ఏ జన్మ పుణ్యమో అక్క’.. మంచు మనోజ్ భావోద్వేగం
ఈ పెళ్లి జరిపించడంలో ఆమె సోదరి లక్ష్మీ ప్రసన్న కీలక పాత్ర పోషించిందని తెలుస్తోంది. అందుకే పెళ్లయిన తెల్లారే మనోజ్ అక్క విషయమై భావోద్వేగానికి లోనయ్యాడు. ఏ జన్మ పుణ్యమో నువ్వు అక్కగా దొరకడం అనే అర్థంలో ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశాడు.
యువ నటుడు మంచు మనోజ్- భూమా మౌనికల వివాహం హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహం సందర్భంగా మంచు కుటుంబంలో (Manchu Family) సందడి వాతావరణం అలుముకుంది. అయితే ఈ పెళ్లి జరిపించడంలో ఆమె సోదరి లక్ష్మీ ప్రసన్న కీలక పాత్ర పోషించిందని తెలుస్తోంది. అందుకే పెళ్లయిన తెల్లారే మనోజ్ అక్క విషయమై భావోద్వేగానికి లోనయ్యాడు. ఏ జన్మ పుణ్యమో నువ్వు అక్కగా దొరకడం అనే అర్థంలో ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశాడు. ఈ సందర్భంగా లక్ష్మీ తనకు హల్దీ వేడుకలో పసుపు రాస్తున్న ఫొటోను షేర్ చేశాడు.
మంచు మనోజ్ (Manchu Manoj), భూమా మౌనిక (Bhuma Mounika Reddy) వివాహం శుక్రవారం రాత్రి జరిగిన ఘనంగా జరిగింది. పెళ్లి వేడుకకు అతి కొద్ది మంది బంధువులు, సినీ ప్రముఖులు మాత్రమే హాజరయ్యారు. కొన్ని రోజుల నుంచి మంచు మనోజ్ పెళ్లి విషయం మంచు కుటుంబంలో భారీగా చర్చ జరిగింది. అయితే వీరి పెళ్లిని కుటుంబ పెద్దలు అంగీకరించలేదని తెలుస్తున్నది. ఈ క్రమంలో లక్ష్మీ చొరవ తీసుకుని మనోజ్, మౌనికల పెళ్లి దగ్గరుండి చేయించిందని సమాచారం. అందుకే పెళ్లికి సంబంధించిన కార్యక్రమాలన్నీ మంచు లక్ష్మీ నివాసంలో జరిగాయి. ఈ సందర్భంగానే మంచు మనోజ్ ఇన్ స్టాగ్రామ్ లో ఓ పోస్టు చేశాడు.
‘‘లవ్యూ అక్క. నువ్వు చేసిన ప్రతి దానికీ ధన్యవాదాలు. ఏ జన్మ పుణ్యమో నాది. నువ్వు అక్కలా దొరికావు’’ అంటూ అని తన స్టేటస్ లో రాసుకున్నాడు. ఈ సందర్భంగా అక్క తనకు బొట్టు పెడుతున్న ఫొటోను పోస్టు చేశాడు. మనోజ్ చేసిన పోస్టును బట్టి చూస్తే వివాహం మొత్తం అక్క లక్ష్మీ చేతులమీదుగా జరిగినట్టు తెలుస్తున్నది. అందుకే అక్కపై మనోజ్ భావోద్వేగానికి లోనయ్యాడు. కాగా మనోజ్, లక్ష్మీలు ఇద్దరు సరదాగా ఉంటారు. స్నేహితుల్లా వీరిద్దరూ ఉంటూ తెగ అల్లరి చేస్తారు.