చాలా రోజుల తర్వాత మంచు మనోజ్(Manchu Manoj) కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ‘దొంగ దొంగది’ మూవీ(Donga Dongadi Movie)తో మూవీ ఇండస్ట్రీలోకి హీరోగా మంచు మనోజ్(Manchu manoj) ఎంట్రీ ఇచ్చాడు. ఆ మూవీ తర్వాత వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్లాడు. అయితే అన్ని సినిమాలకు సరైన విజయం దక్కలేదు. వరుస అపజయాలతో ముందుకు సాగినా ఒక్క సక్సెస్ కూడా దక్కలేదు. ‘ఒక్కడు మిగిలాడు’ సినిమా తీసిన తర్వాత ఇంత వరకూ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాలేదు.
మంచు మనోజ్ కొత్త మూవీ గ్లింప్స్ వీడియో:
మంచు మనోజ్(Manchu Manoj) కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చాడు. తాజాగా రీ ఎంట్రీ ఇస్తున్నాడు. వాట్ ద ఫిష్ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. నేడు మనోజ్ పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమాకు సంబంధించిన గ్లింప్స్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. రెండు విభిన్న స్వభావాలు కలిగిన వ్యక్తిగా మంచు మనోజ్ ఈ గ్లింప్స్ వీడియోలో కనిపిస్తున్నాడు.
వాట్ ద ఫిష్ మూవీని విశాల్ బెజవాడ, సూర్య బెజవాడ నిర్మిస్తున్నారు. ఈ మూవీకి వరుణ్ కోరుకొండ దర్శకత్వం వహిస్తున్నాడు. శక్తికాంత్ కార్తీక్ ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ మూవీ తెరకెక్కుతోందని గ్లింప్స్ వీడియో(Glimps Video)ను చూస్తేనే అర్థమవుతోంది. గ్లింప్స్ వీడియోను చూశాక మనోజ్ (Manchu Manoj)కు ఆల్ ది బెస్ట్ చెబుతూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.