Adipurush: ఆదిపురుష్ నుంచి జై శ్రీ రామ్ సాంగ్ రిలీజ్
ఆదిపురుష్ సినిమా నుంచి జైశ్రీరామ్ ఫుల్ సాంగ్ (Jai sriram Song)ను మేకర్స్ రిలీజ్ చేశారు. ముంబైలో లైవ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి ఈవెంట్ చేస్తూ పాటను విడుదల చేశారు. అజయ్ అతుల్ సంగీతం అందించిన ఈ పాట ప్రస్తుతం ట్రెండింగ్ లో నిలిచింది.
పాన్ ఇండియా(Pan India) స్టార్ ప్రభాస్(Hero Prabhash) రాముడి పాత్రలో నటిస్తున్న సినిమా ఆదిపురుష్(Adipurush Movie). ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. సీత పాత్రలో బాలీవుడ్(Bollywood) భామ కృతి సనన్(Kritisanan) కనిపిస్తోంది. ఓమ్ రౌత్ దర్శకత్వంలో రామాయణం బ్యాక్ డ్రాప్లో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్లు, వీడియోలను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలోని జై శ్రీరామ్ పాట(Jai sriram Song) ఆడియన్స్కు బాగా కనెక్ట్ అయ్యిందని చెప్పాలి.
ఆదిపురుష్ నుంచి జై శ్రీ రామ్ ఫుల్ సాంగ్:
తాజాగా ఆదిపురుష్ సినిమా(Adipurush Movie)లోని జై శ్రీరామ్ ఫుల్ సాంగ్ (Jai sriram Song)ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ మూవీలో ప్రభాస్ రాముడిగా, సైఫ్ అలీఖాన్ రావణుడిగా నటిస్తున్నారు. రూ.600 కోట్ల భారీ బడ్జెట్తో ఈ మూవీ తెరకెక్కుతోంది. జూన్ 16వ తేదిన ఆదిపురుష్ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.
సినిమా విడుదల నేపథ్యంలో ఇప్పటి నుంచే ప్రమోషన్లను మేకర్స్ మొదలు పెట్టారు. ఫ్యాన్స్ మెచ్చేలా ఇకపై వరుస అప్ డేట్లు ఇవ్వనున్నట్లు మేకర్స్ తెలిపారు. తాజాగా నేడు జైశ్రీరామ్ ఫుల్ సాంగ్ (Jai sriram Song)ను రిలీజ్ చేశారు. ముంబైలో లైవ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి ఈవెంట్ చేస్తూ పాటను విడుదల చేశారు. అజయ్ అతుల్ సంగీతం అందించిన ఈ పాట ప్రస్తుతం ట్రెండింగ్ లో నిలిచింది.