‘మిన్నల్ మురళి’ సినిమాతో దేశవ్యాప్తంగా మంచి హిట్ కొట్టిన హీరో టొవినో థామస్ ఇప్పుడు ‘ఏఆర్ఎం’ అనే మూవీ(AMR Movie)తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. హై బడ్జెట్ పీరియడ్ యాక్షన్ మూవీగా ఏఆర్ఎం తెరకెక్కుతోంది. ఈ మూవీకి సంబంధించిన టీజర్‌ను అన్ని భాషల్లో రిలీజ్(Teaser release) చేశారు. తాజాగా తెలుగులో ఈ సినిమా టీజర్ ను నేచురల్ స్టార్ నాని విడుదల చేశారు.
‘ఏఆర్ఎం’ తెలుగు టీజర్:
ఏఆర్ఎం మూవీ(AMR Movie)లో టొవినో థామస్ ట్రిపుల్ రోల్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి విడుదల చేసిన టీజర్(Teaser) అందర్నీ ఆకట్టుకుంటోంది. మణియన్ కథ చెప్పమని చిన్నపాప అడగడంతో ఈ టీజర్ ప్రారంభమవుతుంది. దానికి వాళ్ల అమ్మమ్మ భయపడి ‘రాత్రి పడుకునేముందు భగవంతుడి నామం జపిస్తూ పడుకో, జ్యోతి దీపాన్ని ఎత్తుకెళ్లిన దొంగ కథా అడుగుతావ్ అంటూ ఉండగా టొవినో థామస్ ఎంట్రీ ఇస్తాడు. మణియన్, అజయన్, కుంజికేలు అనే మూడు పాత్రల్లో టొవినో ఈ మూవీలో కనిపించనున్నాడు. కళ్లు చెదిరే యాక్షన్ సన్నివేశాలతో టీజర్ నడుస్తుంది. చివర్లో టొవినో థామస్ బీడీ కాల్చేటప్పుడు వెనక నుంచి కాగడాలు లేచే షాట్ టీజర్‌కే హైలెట్ గా నిలిచింది.