బింబిసార(bimbisara) మూవీ ఎంత సంచలనంగా నిలిచిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో మరో టాలెంటెడ్ డైరెక్టర్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు కళ్యాణ్ రామ్. ఫస్ట్ సినిమా.. పైగా భారీ బడ్జెట్ సినిమాను.. ఆ యంగ్ డైరెక్టర్ హ్యాండిల్ చేసిన తీరుకు అందరు ఫిదా అయిపోయారు.. అందుకే ఇప్పుడు ఏకంగా సూపర్ స్టార్ దగ్గరికెళ్లినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం బింబిసార దర్శకుడు మల్లిడి వశిష్ట(Mallidi Vasishta).. ప్రస్తుతం బిబిసార సీక్వెల్ కథ రెడీ చేసే పనిలో ఉన్నాడు. అయినా కూడా నెక్ట్స్ సినిమా ప్లానింగ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది.
ఆ సినిమా ఎవరితో ఉంటుందనేది క్లారిటీ లేకపోయినా.. రజనీకాంత్(rajinikanth) పేరు తెరపైకి రావడమే.. ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం కళ్యాణ్‌రామ్ రెండు, మూడు సినిమాలకు కమిట్ అయ్యాడు. అవి పూర్తయిన తర్వాతే బింబిసార-2 పట్టాలెక్కనుంది. ఈ లోపు మరో పెద్ద ప్రాజెక్ట్‌ను పట్టేయాలని చూస్తున్నాడట బింబిసార డైరెక్టర్. అందుకే చెన్నైలో చక్కర్లు కొడుతున్నాడట. రీసెంట్గా రజనీ కాంత్‌కు ఓ స్టోరి నెరేట్ చేశాడట వశిష్ట. బింబిసార టాక్ తెలుసుకున్న రజినీ.. వశిష్ట చెప్పిన కథ మొత్తం విన్నాడట.
అయితే తలైవా నుండి ఇంకా ఎలాంటి రెస్పాన్స్ రాలేదని టాక్. ఒకవేళ రజినీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే మాత్రం.. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఉండే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఈ మధ్య రజనీ కూడా యంగ్ టాలెంట్‌తో పని చేసేందుకు సై అంటున్నాడు. ప్రస్తుతం నెల్సన్ కుమార్ దర్శకత్వంలో ‘జైలర్’ అనే సినిమా చేస్తున్నాడు. కాబట్టి మల్లిడి వశిష్ట కథకు తలైవా ఇంప్రెస్ అయితే.. మనోడు బంపర్ ఆఫర్ కొట్టేసినట్టేనని చెప్పొచ్చు. అయితే ఇలాంటి విషయాల్లో క్లారిటీ రావాల్సి ఉంది.