»Maithri Movie Makers Maithri Movie Makers Is Another Huge Project Not Slowing Down At All
Maithri Movie Makers: మైత్రీ మూవీ మేకర్స్ మరో భారీ ప్రాజెక్ట్.. అస్సలు తగ్గడం లేదుగా!
టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థల్లో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్ ఓ రేంజ్లో దూసుకుపోతోంది. టాలీవుడ్ స్టార్ హీరోలందరితోను భారీ బడ్జెట్ సినిమాలు నిర్మిస్తోంది. తాజాగా మరో భారీ ప్రాజెక్ట్ ప్రకటించారు. ఓసారి మైత్రీ సినిమాల లిస్ట్ చూస్తే..!
Maithri Movie Makers: భారీ సినిమాల నిర్మాణంతో పాటు.. డిస్ట్రిబ్యూషన్ పరంగా దూసుకుపోతున్నారు మైత్ర మూవీ మేకర్స్ వారు. సలార్, హనుమాన్ సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసి మంచి లాభాలు అందుకున్నారు. ఇక సినిమాల పరంగా చూస్తే మైత్రీ లైనప్ మామూలుగా లేదు. కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషలలో కూడా సినిమాలు నిర్మిస్తున్నారు. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో అజిత్‌తో భారీ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేశారు. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే టైటిల్‌తో ఈ చిత్రం రూపొందనుంది. విశాల్ మార్క్ ఆంటోనీ సినిమాతో హిట్ అందుకున్న ఆదిక్ రవిచంద్రన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు.
రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించనున్నారు. ఈ క్రమంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ మాట్లాడుతూ.. అజిత్ కుమార్‌తో సినిమా ఆనందంగా ఉందన్నారు. గుడ్ బ్యాడ్ అగ్లీ షూటింగ్ జూన్ నుంచి మొదలు కానుంది.. 2025 సంక్రాంతి రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఇక మైత్రీ సినిమాల లిస్ట్ ఓసారి చూస్తే.. ఈ బ్యానర్ నుంచి వస్తున్న మోస్ట్ అవైటేడ్ సినిమాగా పుష్ప2 ఉంది. ఆగష్టు 15న ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో వస్తున్న ఆర్సీ 16 ప్రాజెక్ట్‌ని త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.
పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఇప్పటికే కొంత వరకు షూటింగ్ జరుపుకుంది. ఇక ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాను కూడా మైత్రీ మూవీ మేకర్సే నిర్మిస్తున్నారు. ఇవే కాదు.. హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్‌తో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారు. రవితేజ, గోపీచంద్ మలినేని సినిమా కూడా లైన్లో ఉంది. ఇవన్నీ కూడా స్టార్ హీరోలతో వందల కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్న చిత్రాలు కావడం విశేషం.