అతడు, ఖలేజా తర్వాత పుష్కరకాలానికి మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్ సెట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే SSMB 28 షూటింగ్ మొదలైపోయింది. ఈ సినిమాపై మహేష్ అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాను త్రివిక్రమ్ పక్కా యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఎస్ఎస్ఎంబీ28 ఫస్ట్ షెడ్యూల్ను కెజియఫ్ ఫైట్ మాస్టర్స్ అన్బు అరివులతో తెరకెక్కించాడు.
ఇక కొంత బ్రేక్ తర్వాత.. డిసెంబర్ ఫస్ట్ వీక్లో సెకండ్ షెడ్యూల్ మొదలు కానుందని తెలుస్తోంది. ఇందులో హీరోయిన్ పూజా హెగ్డే కూడా జాయిన్ కాబోతోంది. ప్రస్తుతం పూజా కాలికి గాయం కారణంగా రెస్ట్ తీసుకుంటోంది. అందుకే డిసెంబర్లో నెక్ట్స్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. జిమ్లో గట్టిగా కసరత్తులు చేస్తున్నాడు మహేష్ బాబు.
అందుకు సంబంధించిన మహేష్ బీస్ట్ లుక్ వర్కౌట్ ఫోటో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ ఫోటోను షేర్ చేస్తూ.. బీస్ట్ రాకతో స్క్రీన్స్ ఫైర్ అవడం పక్కా అని చెప్పుకొచ్చారు మేకర్స్. ప్రస్తుతం ఈ జిమ్ ఫోటోను తెగ షేర్ చేస్తున్నారు అభిమానులు.. దాంతో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ ఫోటోలో మహేష్ నయా లుక్ కూడా అదరహో అనేలా ఉంది..
మొత్తంగా త్రివిక్రమ్ ఈ సినిమాతో అదిరిపోయే యాక్షన్ ఇవ్వబోతున్నాడని చెప్పొచ్చు. ఈ సినిమాను వచ్చే సమ్మర్లో ఏప్రిల్ 28న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కానీ షూటింగ్ డిలే అవడంతో.. పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు. ఏదేమైనా మహేష్ బీస్ట్ లుక్కు ఫిదా అవుతున్నారు అభిమానులు.