అనుష్క – నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty) జంటగా ‘మిస్ శెట్టి .. మిస్టర్ పోలిశెట్టి’ సినిమా రూపొందింది. చాలా గ్యాప్ తరువాత అనుష్క చేసిన మూవీ కావడంతో, యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ – ప్రమోద్ (Vamsi – Pramod) ఈ సినిమాను నిర్మించారు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక వీడియో సాంగును రిలీజ్ చేశారు.మూడేళ్ల కిందట వచ్చిన ‘జాతిరత్నాలు’ సినిమా(Jati Ratnalu’ movie) నవీన్ కెరీర్లో ఓ టర్నింగ్ పాయింట్ అయింది. టాలీవుడ్(Tollywood)లో ఆయన తిరుగులేని క్రేజ్‌ను, మార్కెట్‌ను తెచ్చిపెట్టింది. ప్రస్తుతం నవీన్ ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ అనే రొమ్-కామ్ సినిమా చేస్తున్నాడు.అయితే జీవితంలో పెళ్లి వద్దనుకునే అనుష్క(Anushka), నవీన్‌తో ఎలా ప్రేమలో పడింది? వాళ్ల ప్రేమ పెళ్ళి వరకు సాగుతుందా? స్టాండప్ కమెడియన్‌గా రాణించాలనుకునే నవీన్ జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది ఇలా ఎన్నో అంశాలకు ఈ టీజర్ తెరలేపింది.
అయితే టీజర్ మాత్రం కొత్తగా అనిపిస్తుంది. చాలా కాలం తర్వాత మంచి లవ్ ఎంటర్టైనర్ సినిమా చూస్తున్నామనే ఫీల్‌ను కలిగిస్తుంది. ముఖ్యంగా నవీన్ కామెడీ టైమింగ్ తెగ ఆకట్టుకుంటుంది.’ఎందుకంత ఇష్టం నేనంటే .. ఇందులోని గొప్ప నేను నీకంటే .. ఎంత ఎంత నచ్చుతుందో నీ పెదాలు నన్ను మెచ్చుకుంటే’ అంటూ ఈ పాట సాగుతోంది. రాధన్ స్వరపరిచిన ఈ బాణీకి (Ramajogaiah Shastri) సాహిత్యాన్ని అందించగా, కార్తీక్ ఆలపించాడు. హుషారైన బీట్ .. అందుకు తగిన కొరియోగ్రఫీ (Choreography) ఆకట్టుకుంటున్నాయి. అనుష్కను అభిమానిస్తూ .. ఆరాధిస్తూ .. ప్రేమిస్తూ, ఆమె రాకతో తన లైఫ్ మొత్తం మారిపోయిందని హీరో వ్యక్తం చేసే తన మనసులోని మాటనే ఈ పాట. ఆగస్టు 4వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. ఈ పాటతో ఈ సినిమా ప్రమోషన్స్ పుంజుకుంటాయనే చెప్పాలి.