Mem Famous : ‘మేమ్ Famous’ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్
ఛాయ్ బిస్కెట్ ఫిలిమ్స్(Chaibisket Films), లహరి ఫిలిమ్స్ సంస్థలు ఈ ఏడాది రైటర్ పద్మభూషణ్(Writer padmabhushan) సినిమాతో సక్సెస్ సొంతం చేసుకున్నాయి. తాజాగా ఈ రెండు బ్యానర్ల నుంచి ఇప్పుడు మరో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఛాయ్ బిస్కెట్ ఫిలిమ్స్(Chaibisket Films), లహరి ఫిలిమ్స్ సంస్థలు ఈ ఏడాది రైటర్ పద్మభూషణ్(Writer padmabhushan) సినిమాతో సక్సెస్ సొంతం చేసుకున్నాయి. తాజాగా ఈ రెండు బ్యానర్ల నుంచి ఇప్పుడు మరో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రైటర్ పద్మభూషణ్ మేకర్స్ నుంచి వస్తోన్న మరో సినిమా మేమ్ ఫేమస్(Mem Famous). ఈ మూవీ విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాలో సుమంత్ ప్రభాస్(Sumanth Prabhash), సార్య హీరోహీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు.
‘మేమ్ Famous’ నుంచి లిరికల్ సాంగ్ :
సుమంత్ ప్రభాస్(Sumanth Prabhash) ఈ సినిమాకు స్వీయ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘అయ్యయ్యో’ లిరికల్ వీడియో సాంగ్ (Lyrical song)ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ‘అయ్యయ్యయ్యో ఏమైందీ గుండెలోనా’ అంటూ పల్లెటూరి బ్యాక్ డ్రాప్లో ఈ పాట సాగుతుంది. ఈ పాటను కళ్యాణ్ నాయక్, హనీ సార్య రాశారు. రాహుల్ సిప్లిగంజ్(Rahul sipligunz) ఈ పాటను పాడాడు.
పల్లెటూరి ప్రజలైన సుమంత్ ప్రభాస్(Sumanth Prabhash), సార్య మధ్య రొమాంటిక్ రిలేషన్ షిప్ నేపథ్యంలో ఈ పాట సాగుతుంది. ఈ పాట యూత్ కు బాగా కనెక్ట్ అయ్యిందని చెప్పాలి. సాంగ్, ఫస్ట్ లుక్ తో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. స్నేహం, కుటుంబ నేపథ్యం, ప్రేమ వంటి అంశాల పరంగా మేమ్ ఫేమస్(Mem Famous) సినిమా రూపొందింది. జూన్ 2వ తేదిన ఈ మూవీని రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.