కోలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘లవ్ టుడే’ మూవీని.. తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు. ఇక్కడ కూడా ఈ సినిమా మంచి విజయం అందుకుంది. తెలుగు కుర్రకారుకు తెగ నచ్చేసింది ‘లవ్ టుడే’. దాంతో రిలీజైన మొదటి రోజు నుంచే మంచి వసూళ్లను రాబడుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల్లోనే 6.95 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టినట్టు ట్రేడ్ వర్గాల సమాచారం. షేర్ వచ్చేసి 3.61 కోట్లు వచ్చినట్టు తెలుస్తోంది. 2.7 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమాను.. 3 కోట్లు బ్రేక్ ఈవెన్‌గా టార్గెట్‌గా రిలీజ్ చేశారు. ఈ లెక్కన మూడు రోజుల్లోనే ‘లవ్ టుడే’ బ్రేక్ ఈవెన్ దాటి లాభాల బాట పట్టిందని అంటున్నారు.
దాంతో కాంతార లాగే ఈ సినిమా కూడా భారీ స్థాయిలో లాభాలను తెచ్చిపెట్టడం ఖాయమంటున్నారు. ప్రదీప్ రంగనాథన్ హీరోగా, ఇవానా హీరోయిన్గా నటించిన ఈ చిత్రం.. యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ఓటిటిలోకి ఎప్పుడు రాబోతోందనే చర్చ జరుగుతోంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను భారీ మొత్తానికి ప్రముఖ ఓటిటి సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. లేటెస్ట్ అప్టేట్ ప్రకారం..
ముందుగా ఈ చిత్రం తమిళ్ వెర్షన్ ఓటిటి స్ట్రీమింగ్కి రానుందని తెలుస్తోంది. తమిళంలో ఈ మూవీని నవంబర్ 4న రిలీజ్ చేశారు. దాంతో నెట్ ఫ్లిక్స్‌లో డిసెంబర్ 2 నుంచి ‘లవ్ టుడే’ స్ట్రీమింగ్ కానుందని సమాచారం. తెలుగులో నవంబర్ 25 న రిలీజ్ చేశారు కాబట్టి.. ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ఓటిటిలోకి రానుందని అంటున్నారు. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.