విక్రమ్ వంటి మాసివ్ హిట్ తర్వాత లోకేష్ కనగరాజ్ చేస్తున్న సినిమా లియో. ఇప్పటికే దళపతి విజయ్‌తో మాస్టర్ సినిమా చేశాడు లోకేష్. కానీ ఈ సినిమాతో హిట్ మిస్ అయ్యారు విజయ్-లోకేష్. అందుకే ఈసారి పాన్ ఇండియా మార్కెట్‌ని టార్గెట్ చేశారు.
దసరా కానుకగా అక్టోబర్ 19న లియో సినిమా రిలీజ్ కానుంది. మొదటి నుంచి ఈ సినిమాపై అంచనాలు పెంచుతూనే ఉన్నాడు లోకేష్. బ్యాక్ టు బ్యాక్ సాలిడ్ పోస్టర్స్ రిలీజ్ చేస్తు ఫుల్లుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. తాజాగా లియో ట్రైలర్ రిలీజ్ చేశారు. ఎప్పుడైతే ట్రైలర్ అనౌన్స్మెంట్ ఇచ్చారో.. అప్పటి నుంచి దళపతి ఫ్యాన్స్ ట్రైలర్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తూ వచ్చారు. అక్టోబర్ 5ని లియో ట్రైలర్ డేగా మారుస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఇక ట్రైలర్ చూసిన తర్వాత పండగ చేసుకుంటున్నారు. రెండు నిమిషాల 40 సెకన్లు నిడివితో వచ్చిన ఈ ట్రైలర్ యాక్షన్ ప్యాక్డ్గా ఉంది.
కశ్మీర్లో బ్యూటీఫుల్‌గా మొదలైన్ ట్రైలర్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. సీరియల్ కిల్లర్ నడి రోడ్డు మీద గుడ్డిగా షూట్ చేస్తున్నాడనే.. విజయ్ డైలాగ్‌తో మొదలైన ట్రైలర్లో విజయ్ విశ్వరూపం చూపించాడు. సంజయ్ దత్, యాక్షన్ కింగ్ అర్జున్, గౌతమ్ వాసు దేవ్ మీనన్ పవర్ ఫుల్ రోల్ ప్లే చేసినట్టుగా తెలుస్తోంది. పోలీస్, విలన్ గ్యాంగ్ మధ్యలో విజయ్ అనేలా ట్రైలర్ కట్ చేశారు. చాలా కాలం తర్వాత విజయ్, త్రిష కాంబినేషన్ అదిరిపోయేలా ఉంది. ముఖ్యంగా విజయ్ చెప్పే ఓ బూతు డైలాగ్ ట్రైలర్లో పీక్స్ అనేలా ఉంది. అదిరిపోయో యాక్షన్, విజయ్ యాక్టింగ్ నెక్స్ట్ లెవల్ అనేలా ఉంది.
ముఖ్యంగా మంచు కొండల్లో వోల్ఫ్‌తో విజయ్ ఫైట్ పీక్స్ అంతే. అయితే ఈ సినిమా లోకేష్ యూనివర్స్‌లో భాగంగా వస్తున్నట్టుగానే ఉంది. ఎందుకంటే ఖైదీ, విక్రమ్ రేంజ్‌లోనే విలన్ గ్యాంగ్‌ను చూపించాడు లోకేష్. అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ కూడా బాగుంది. మొత్తంగా లియో ట్రైలర్ బాక్సాఫీస్ దగ్గర విధ్వంసం సృష్టించేలా ఉంది. ఇక రిలీజ్ టైం దగ్గర పడుతుండడంతో సెన్సార్ కంప్లీట్ చేసుకుంది లియో. ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికేట్‌ను జారీ చేసింది. రన్ టైం వచ్చేసి రెండు గంటల నలభై నిమిషాలు లాక్ చేసినట్టుగా తెలుస్తోంది.
ఒక స్టార్ హీరో కమర్షియల్ సినిమాకి రెగ్యులర్‌గా ఉండే నిడివితోనే లియో థియేటర్లోకి రాబోతోంది. కాబట్టి ఆడియన్స్‌కి లాగ్ అనిపించే అవకాశం లేదు. ఇక సెన్సార్ టాక్ ప్రకారం.. లియో అదిరిపోయిందని తెలుస్తోంది. ముఖ్యంగా విజయ్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ అంటున్నారు. ఖచ్చితంగా లియో సినిమా విజయ్ కెరీర్ బెస్ట్‌గా నిలుస్తుందని అంటున్నారు. దీంతో లియో పై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి.