Bigg boss Telugu Yawar Touch Sobha Inappropriately
Sobha-Yawar: బిగ్ బాస్-7 సీజన్ ఇప్పుడిప్పుడే హైప్ వస్తోంది. పార్టిసిపెయింట్స్ రచ్చ మొదలైంది. హౌస్‌లో యావర్, తేజ, గౌతమ్ కాస్త సందడి చేస్తున్నారు. సందీప్ మాస్టర్‌లానే ఉండగా.. శివాజీ బిగ్ బాస్‌లానే వ్యవహరిస్తున్నారు. మొత్తానికి హౌస్‌లో రచ్చ కాస్త తగ్గిందని చెప్పాల్సి ఉంటుంది.
బిగ్ బాస్ 31వ రోజు ఎపిసోడ్లో టాస్క్ ఇచ్చారు. ఒకరి వద్ద ఉన్న వస్తువులను దొంగిలించే టాస్క్ అదీ.. టేస్టీ తేజ (teja) వద్ద నుంచి శోభ వస్తువులను తీసుకుంటుంది. ఇదే అంశంపై ప్రిన్స్ యావర్, శోభా శెట్టి, శివాజీ మధ్య డిస్కషన్ జరిగింది. తేజ (teja) నుంచి తీసుకున్న వస్తువును తన టైట్ డ్రెస్ లోపల శోభ (sobha) పెట్టుకుంటుంది.
తేజ- యావర్ (yawar) మాట్లాడుకుంటారు. తమ జట్టు విజయం కోసం యావర్ రంగంలోకి దిగుతాడు. తేజ వద్ద నుంచి తీసుకున్న ఐటెమ్ ఇవ్వాలని కోరతాడు. ఆమె ససేమిరా అంటోంది. మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. డ్రెస్‌లో ఉన్న దానిని తీసేందుకు ప్రయత్నిస్తాడు. ఆ సమయంలో శోభ ప్రైవేట్ పార్ట్స్‌ను యావర్ తాకుతాడు ఇదే విషయాన్ని శోభ చెబుతోంది. వెంటనే టాస్క్ ఆపేయాలని బిగ్ బాస్ కూడా చెబుతాడు. దాంతో ఆ టాస్క్ అర్ధాంతరంగా ముగుస్తోంది.
టాస్క్‌లో భాగంగానే యావర్ ఆడాడు. అనుకోకుండా అలా జరిగింది. మరీ దీనిపై శనివారం హోస్ట్ నాగార్జున క్లాస్ పీకే అవకాశం ఉంది. లాస్ట్ వీక్.. గౌతమ్ పట్ల తేజ వ్యవహరించిన తీరుపై ఏకీపారేశాడు. ఇప్పుడు యావర్‌కు కూడా అదే రేంజ్లో క్లాస్ పడనుంది.