‘దమ్ లగా కే హైషా’ సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టింది భూమి పెడ్నేకర్. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె గురించి అందరికీ తెలిసిందే. మొదటి సినిమాతోనే నేషనల్ ఫిల్మ్ అవార్డులోని బెస్ట్ ఫిమేల్గా అవార్డు సొంతం చేసుకుంది. ప్రస్తుతం భూమి వరుస సినిమాలతో బిజీగా ఉంది. అయితే తాజాగా ఈమె ఓ ఇంటర్వూలో సోషల్ మీడియాలో వచ్చే విమర్శలపై స్పందించింది. ప్రస్తుత రోజుల్లో ట్రోలింగ్ సాధారణం అయిపోయింది. ఏం చేసినా, ఎలా ఉన్నా జనాలు ట్రోల్ చేస్తారు. సోషల్ మీడియాలో పెట్టిన ప్రతీ పోస్ట్‌కు విమర్శంచే వాళ్లు కొందరు ఉంటారు. వాళ్ల పని కేవలం విమర్శించడమే. చిన్నప్పటి నుంచి నా డ్రెస్సింగ్‌పై కామెంట్స్ చేస్తూనే ఉన్నారు.
పొట్టి దుస్తులు ఎందుకు వేసుకుంటున్నావు.. మన సంస్కృతి ఇదేనా అని నన్ను చాలామంది ప్రశ్నించారు. పండుగ రోజుల్లో సంప్రదాయ దుస్తులు ధరించి పోస్ట్ చేసిన ఎన్నో అసభ్యకర పదాలతో విమర్శించేవారు. సినిమా ప్రమోషన్స్‌కి వెళ్లకపోయిన సరే.. కనిపించడం లేదని కూడా విమర్శిస్తారు. ఇంతకు ముందు మన గురించి ఎక్కువగా మన ఇంట్లో వాళ్లు మాట్లాడుకునే వాళ్లు. కానీ ప్రస్తుతం ఈ ట్రోల్స్ చేసేవాళ్లు ఎక్కువగా మాట్లాడుకుంటున్నారని భూమి అంటోంది. మనం ఇలాంటి ట్రోల్స్ చదవాలన్నా చాలా ధైర్యం కూడా ఉండాలనేది భూమి అభిప్రాయం. అందుకే ఆమె ఎలాంటి ట్రోల్స్ పట్టించుకోదు. స్త్రీలను గౌరవించడం రానివాళ్లు కూడా మన సంప్రదాయాలు, సంస్కృతుల గురించి మాట్లాడుతూ ట్రోల్స్ చేస్తున్నారని భూమి తెలిపింది.
ఇది కూడా చూడండి:Shraddha Kapoor:పెళ్లి కామెంట్లపై స్పందించిన శ్రద్ధా కపూర్!