ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్సీ 15 ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను అంతకు మించి అనేలా తెరకెక్కిస్తున్నాడు. నిర్మాత దిల్ రాజు కూడా ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఆర్సీ15 లేటెస్ట్ షెడ్యూల్ న్యూజిలాండ్‌లో జరుగుతోంది. వచ్చే ఏడాదిలో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబుతో ఆర్సీ 16 ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు చరణ్. దాంతో ఒకే ఒక్క సినిమా చేసిన బుచ్చిబాబు.. పాన్ ఇండియా స్టార్‌ను ఎలా డీల్ చేస్తాడనే ఆసక్తి అందరీలోను మొదలైంది. అలాగే మిగతా స్టార్ క్యాస్టింగ్ కూడా ఇంట్రెస్టింగ్గా మారింది. ముఖ్యంగా హీరోయిన్ ఎవరనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో బేబమ్మ ఆ ఛాన్స్ అందుకుంటుందా.. అనే టాక్ నడుస్తోంది. అంతేకాదు.. కృతిశెట్టిని సెకండ్ హీరోయిన్గా ఫిక్స్ చేశారని తెలుస్తోంది. ఉప్పెన సినిమాతో బుచ్చిబాబుకు ఉన్న సాన్నిహిత్యంతో.. చరణ్ సరసన కృతి ఛాన్స్ కొట్టేసిందని అంటున్నారు. అయితే మెయిన్ హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటీ, శ్రీదేవి కూతురు జాన్వీకపూర్ పేరు వినిపిస్తోంది. దీనికి కూడా ఓ కారణం ఉంది. ఉప్పెన తర్వాత ఎన్టీఆర్‌తో సినిమా చేయాలని చూశాడు బుచ్చిబాబు. ఈ కాంబినేషన్లో హీరోయిన్గా జాన్వీని తీసుకుంటున్నారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ తారక్ తన కథను చరణ్ దగ్గరికి పంపించాడు. బుచ్చిబాబు కూడా చెర్రీని ఇంప్రెస్ చేయడంతో.. ఆర్సీ 16 అనౌన్స్మెంట్ వచ్చేసింది. అందుకే ఈ ప్రాజెక్ట్‌లో జాన్వీ పేరు తెరపైకొచ్చింది. అయితే ఈ బ్యూటీని తీసుకోకపోయినా.. కృతిశెట్టి మాత్రం ఫిక్స్ అంటున్నారు. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.