»Kollywood Hero Arya Look Viral In Venkys Saindhav
Venkys Saindhav:లో కోలీవుడ్ హీరో లుక్ వైరల్!
సీనియర్ హీరోలు తమ ఏజ్‌కు తగ్గట్టుగా సినిమాలు చేస్తే హిట్ గ్యారెంటీ అని కమల్ హాసన్, రజనీకంత్ ప్రూవ్ చేశారు. టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్(venkatesh) కూడా అదే రేంజ్‌తో 'సైందవ్' సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమాలో కోలీవుడ్ హీరో లుక్ రివీల్ చేయగా వైరల్ అవుతోంది.
ఇక కమల్ హాసన్ పనైపోయింది.. అనుకుంటున్న సమయంలో వచ్చింది ‘విక్రమ్’ సినిమా. టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ సినిమా ఊహించని విధంగా బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. ఎంతలా అంటే కమల్ హాసన్‌కు ఉన్న అప్పులన్నీ తీర్చేసింది. ఇక వరుస ఫ్లాపులతో ఉన్న సూపర్ స్టార్ రజనీ కాంత్ ‘జైలర్’ సినిమాతో సాలిడ్ బౌన్స్ బ్యాక్ అయ్యాడు. నెల్సన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇంకా థియేటర్లో రన్ అవుతోంది. అయితే ఈ సినిమాకు పోటీగా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’ దారుణమైన పరాజయం పాలైంది. ఎందుకంటే ఈ సినిమాను వయసుతో సంబంధం లేకుండా చేశాడు చిరు. అది కూడా శ్రీముఖితో ఖుషి నడుము సీన్‌ను ఇమిటేట్ చేసి ఇరిటేషన్ తెప్పించాడు. ఈ వయసులో చిరు చేయాల్సింది ఇది కాదని మెగా ఫ్యాన్స్(mega fans) ఫీల్ అయ్యారు. కాబట్టి.. తమ వయసుకు తగ్గట్టుగా పాత్రలు ఎంచుకొని సినిమాలు చేస్తే బెటర్ అంటున్నారు నెటిజన్స్.
ఈ విషయంలో మరో సీనియర్ హీరో వెంకటేష్(venkatesh) పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తున్నట్టే ఉంది. హిట్ సిరీస్‌తో బ్లాక్ బస్టర్స్ కొట్టిన శైలేష్ కొలను దర్శకత్వంలో ప్రస్తుతం ‘సైంధవ్’ అనే సినిమా చేస్తున్నాడు వెంకీ. ఈ సినిమాలో ప్రతి భాష నుంచి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నవాజుద్దీన్ సిద్ధిఖీ, శ్రద్ధా శ్రీనాథ్, రుహాని శర్మ, ఆండ్రియా జెరేమియా, సారా, జయప్రకాష్ కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఇప్పటికే వీళ్లకు సంబంధించిన లుక్స్ కూడా రివీల్ చేశాడు. వీళ్లే కాదు కోలీవుడ్ హీరో ఆర్య కూడా సైంధవ్ సినిమాలో ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా ఆర్య ఫస్ట్ లుక్‌ని రివీల్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్లో చేతిలో మెషిన్ గన్‌తో ఉన్న ఆర్య లుక్ టెరిఫిక్‌గా ఉంది. ఈ సినిమాలో ఆర్య పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.