బాలీవుడ్ కపుల్ కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 6న వాళ్ల పెళ్లి అంగరంగ వైభవంగా జరగనుంది. ఈరోజు నుంచి పెళ్లి వేడుకలు ప్రారంభం అయ్యాయి. ఇవాళ అంటే 4న హల్దీ, 5న సంగీత్ వేడుకలను నిర్వహించనున్నారు. రాజస్థాన్‌లోని జైసల్మీర్‌లో ఉన్న సూర్యగ్రహ్ ప్యాలెస్‌లో వీళ్ల పెళ్లి ఘనంగా జరగనుంది. దీంతో పెళ్లి వేడుకల కోసం కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా, ఇరు కుటుంబ సభ్యులు, ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా, బంధువులు జైసల్మీర్ బయలుదేరారు. మనీష్‌తో కలిసి కియారా జైసల్మీర్ ఎయిర్ పోర్ట్‌లో అడుగుపెట్టిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
#WATCH | Accompanied by fashion designer Manish Malhotra, actress #KiaraAdvani arrived in Jaisalmer, Rajasthan today. Actors Kiara Advani and Sidharth Malhotra are all set to tie the knot on February 6. pic.twitter.com/XZFBpFU26b
పెళ్లి అనంతరం ఢిల్లీ, ముంబైలో పెళ్లి రిసెప్షన్ జరగనుంది. పెళ్లికి మాత్రం దగ్గరి బంధువులు, స్నేహితులు మాత్రమే హాజరుకానున్నారు. ఇక.. కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా ఇద్దరూ షేర్షా అనే మూవీలో నటించారు. అప్పుడే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ తర్వాత ఇద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. కొన్నేళ్లు సహజీవనం చేశారు. చివరికి వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు.