అసలు కాంతార(kantara) హీరో కూడా ఎవరో తెలియని సినిమాకు జనాలు బ్రహ్మరథం పడుతుండడం.. ఇప్పుడు సినీ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. కన్నడలో చిన్న సినిమాగా వచ్చిన కాంతార.. ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అసలు ఈ సినిమా ఈ రేంజ్లో హిట్ అవుతుందని హీరో రిషబ్ శెట్టి కూడా ఊహించి ఉండడు. ఈ సినిమా విజయంలో మౌత్ టాక్ కీలక పాత్ర పోషించింది. మౌత్ టాక్ వల్ల.. అసలు కాంతారలో ఏముందనే ఆసక్తి రోజు రోజుకి పెరిగిపోవడంతో.. కలెక్షన్లు పెరుగుతునే ఉన్నాయి.
ఒక్క తెలుగులోనే 30 కోట్ల గ్రాస్ మార్కును చేరుకుంది. దాంతో అల్లు అరవింద్‌కు పదింతల లాభాన్ని తెచ్చి పెట్టింది ఈ సినిమా.. థర్డ్ వీక్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కూడా ఈ సినిమా వసూళ్లు ఆగడం లేదు. పైగా దీపావళికి వచ్చిన సినిమాలు పెద్దగా అలరించకపోవడంతో.. ఈ సినిమా థియేటర్ల సంఖ్య రోజు రోజుకి రెట్టింపు అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో 550 పైగా థియేటర్లలో ఈ సినిమా ఆడుతున్నట్టు తెలుస్తోంది.
దాంతో చిత్ర యూనిట్ సక్సెస్ టూర్ కూడా నిర్వహిస్తోంది. అక్టోబర్ 29న తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలో పలు థియేటర్స్‌లలో కాంతార టీమ్ పర్యటించనుంది. ఈ టూర్లో హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి పాల్గొనబోతున్నాడు. మరోవైపు.. హిందీ ఆడియన్స్ కాంతారకు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ మధ్య బాలీవుడ్ సినిమాలకు మొహం వాచిపోయిన ఉన్న బాలీవుడ్ జనాలు.. కాంతార చూసి ఫిదా అవుతున్నారు. అసలు అక్కడ ఇక్కడ అని కాదు.. రిలీజ్ అయిన అన్ని చోట్ల కాంతార రికార్డులు క్రియేట్ చేస్తోంది.