Kangana Ranaut : హృతిక్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన కంగనా
బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ స్టార్ హీరో హృతిక్ రోషన్‌పై షాకింగ్ కామెంట్స్ చేసింది. అమీర్‌తో స్నేహం చెడిపోవడానికి కారణం హృతిక్ రోషనే అని ఓ నోట్‌ను పోస్టు చేసింది.
సినీ సెలబ్రిటీల (Cine Celebrities) మధ్య గొడవలు రావడం సహజమే. కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ప్రేమ, స్నేహం వంటివి దెబ్బతింటూ ఉంటాయి. సినీ ఇండస్ట్రీలో ఎవరు ఎంతకాలం స్నేహంగా ఉంటారో చెప్పలేరు. చిన్న చిన్న కారణాలకే సెలబ్రిటీలు విడిపోవడం సహజమే. బాలీవుడ్(Bollywood) స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్(Kangana Ranaut) విషయంలో కూడా ఇదేవిధంగా జరిగింది. అమీర్ ఖాన్(Amir Khan)తో కంగనా రనౌత్ స్నేహం కొద్ది రోజులు మాత్రమే సాగింది. వారి ఫ్రెండ్షిప్ కటిఫ్ కావడానికి కారణం హీరో హృతిక్ రోషన్(Hrithik Roshan ) అని కంగనా స్వయంగా తెలిపింది.
తాజాగా కంగనా రనౌత్(Kangana Ranaut) ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో రెండు పోస్టులు షేర్ చేసింది. అమీర్ ఖాన్(Amir Khan)తో తాను స్నేహం చేసిన రోజులను గుర్తు చేసుకుంది. ఆ రోజులు ఎప్పటికీ తిరిగి రావని తెలిపింది. తనకు అమీర్ దిశానిర్ధేశం చేశారని, తనను ఎంతగానో ప్రశంసించారని, సినిమాల విషయంలో తనకు చాలా సాయం చేశారని కంగనా రనౌత్ తెలిపింది. హృతిక్ రోషన్(Hrithik Roshan ) తన మీద లీగల్ కేసు వేయడంతో మొత్తం ముగిసిపోయినట్లుగా తన పోస్టులో రాసుకొచ్చింది.
తానొక వైపు ఇండస్ట్రీ మరోవైపు వెళ్లిపోయాయని కంగనా(Kangana Ranaut) చెప్పుకొచ్చింది. అమీర్ ఖాన్‌తో తనకు స్నేహం ముగిసిపోవడానికి కారణం హృతికే అని వెల్లడించింది. ప్రస్తుతం ఆమె పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో హృతిక్ రోషన్(Hrithik Roshan ), కంగనా రనౌత్‌లు పలు సినిమాల్లో నటించారు. వీరిద్దరి కాంబోలో కైట్స్, క్రిష్ 3 సినిమాలు తెరకెక్కాయి. అప్పుడే వీరిద్దరి మధ్య ప్రేమ మొదలవ్వగా ఆ తర్వాత పలు మనస్పర్థల కారణంగా ఇద్దరూ విడిపోవాల్సి వచ్చింది.