»Jonnalagadda Chaitanya Visits Tirumala Alongwith Family But Wife Niharika Konidela Missed Whats Going
Niharika Husband విడాకులు నిజమేనా? తిరుమలకు ఒంటరిగా నిహారిక భర్త చైతన్య
జొన్నలగడ్డ చైతన్య తన కుటుంబసభ్యులతో తిరుమల వేంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. వారి రాకను గమనించిన మీడియా చైతన్యను పలకరించే ప్రయత్నం చేశారు. కుటుంబంతో ఫొటోలకు ఫోజులిచ్చారు.
కొంతకాలంగా నాగబాబు కుమార్తె నిహారిక (Niharika Konidela) వైవాహిక జీవితంపై వస్తున్న పుకార్లకు మరింత బలం చేకూరనుంది. ఎందుకంటే నిహారిక భర్త జొన్నలగడ్డ చైతన్య (Jonnalagadda Chaitanya) ఒంటరిగా కనిపించాడు. అది కూడా తిరుమల ఆలయానికి తన కుటుంబంతో హాజరయ్యాడు. కానీ చైతన్య వెంటనే అతడి భార్య నిహారిక కనిపించలేదు. దీంతో నిహారికతో బంధం తెగదెంపులు అయ్యిందనే వార్త వాస్తవమేనని తెలుస్తోంది.
నిహారిక, చైతన్య మధ్య విబేధాలు తీవ్రమయ్యాయని వారిద్దరూ ఇప్పుడు విడివిడిగా ఉంటున్నారని పుకార్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే వారు సోషల్ మీడియాలో తమ పేర్లు మార్చుకోవడం.. అన్ ఫాలో చేయడం వంటివి వాటికి రుజువులుగా పేర్కొంటున్నారు. తాజాగా శుక్రవారం జొన్నలగడ్డ చైతన్య తన కుటుంబసభ్యులతో తిరుమల వేంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. వారి రాకను గమనించిన మీడియా చైతన్యను పలకరించే ప్రయత్నం చేశారు. కుటుంబంతో ఫొటోలకు ఫోజులిచ్చారు. కానీ ఎలాంటి మాటలు మాట్లాడలేదు.
మాట్లాడకుండానే వెళ్లిపోయారు. నిహారిక లేకుండా కుటుంబంతో పాటు చైతన్య ఆలయానికి రావడం వారిద్దరూ దూరంగా ఉన్నారని సాగుతున్న ప్రచారం వాస్తవమేనని నమ్మాల్సి వస్తోంది. ఇటీవల వీరిద్దరూ కలిసి ఎక్కడా కనిపించడం లేదు. కాగా, నిహారిక ఇటీవల డెడ్ పిక్సెల్స్ అనే వెబ్ సిరీస్ చేసింది. పెళ్లయిన మూడేళ్లు కాలేదు అప్పుడే వీరి పెళ్లి పెటాకులయ్యిందా? అని ఆసక్తికర చర్చ కొనసాగుతోంది. 9 డిసెంబర్ 2020న వీరిద్దరి పెళ్లి జరిగిన విషయం తెలిసిందే.