ప్రముఖ బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ యాక్ట్ చేసిన జవాన్ మూవీ నిన్న రిలీజ్ కాగా..ఈ చిత్రంలో యాక్ట్ చేసిన వారు సైతం స్పెషల్ షోలను వీక్షించారు. వారిలో ఎవరెవరు ఉన్నారో ఇప్పుడు చుద్దాం.
Jawan Special Screening: బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ లీడ్ రోల్లో యాక్ట్ చేసిన జవాన్ మూవీ ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ సినిమా రిలీజ్‌కు ముందే ముంబయిలో సినీ తారల కోసం ఓ స్పెషల్ స్క్రీనింగ్‌ను ఏర్పాటు చేశారు. ఈ జవాన్ స్క్రీనింగ్ కి చాలా మంది సినీ తారలు హాజరయ్యారు. దీపికా పదుకొణె, షారూక్ ఖాన్ కుమార్తె సుహానా, హీరోయిన్ నయనతార, ఆమె భర్త, ప్రముఖ డైరెక్టర్ విగ్నేష్ కూడా ఈ స్క్రీనింగ్ కి హాజరయ్యారు.
ఈ సినిమాలో అతిథి పాత్రలో నటించిన దీపికా పదుకొణె స్క్రీనింగ్‌లో క్లిక్ అయింది. దీపికా నల్ల చీరలో ఎప్పటిలాగే అద్భుతంగా కనిపించింది. నయనతార ముఖ్యంగా తన భర్త, చిత్ర నిర్మాత విఘ్నేష్ శివన్‌తో కలిసి తన సినిమా ప్రదర్శన కోసం ముంబైకి వెళ్లింది. షారుఖ్ ఖాన్ కుమార్తె సుహానా కూడా స్క్రీనింగ్ వేదిక వద్దకు వెళ్లడం కనిపించింది. ఆమెతో పాటు ఆమె స్నేహితులు కూడా ఉన్నారు. ఇక ఈ మూవీకి పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. అట్లీ మార్క్ సినిమాలో క్లియర్ గా కనపడుతోంది. ఇటు దక్షిణాదిన, అటు బాలీవుడ్ లోనూ సినిమా దూసుకుపోతోంది. పఠాన్ తర్వాత షారూఖ్ నుంచి వచ్చిన హిట్ ఇది. ఇది కూడా కాసుల వర్షం కురిపించడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులుపుతోంది. దీంతో ఈ సినిమాలో నటించిన వారి రెమ్యూనరేషన్ ఎంత? అనేది హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా దీపిక పదుకొనే దీనిపై క్లారిటీ ఇచ్చేసింది.