Ram Charan శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాను.. ఆర్సీ 15 వర్కింగ్ టైటిల్‌తోనే మొదలు పెట్టారు. దాంతో ఈ సినిమా టైటిట్ ఏంటనేది ఆసక్తికరంగా మారింది. టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు.. ఆర్సీ 15ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. శంకర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు.
రామ్ చరణ్, శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాను.. ఆర్సీ 15 వర్కింగ్ టైటిల్‌తోనే మొదలు పెట్టారు. దాంతో ఈ సినిమా టైటిట్ ఏంటనేది ఆసక్తికరంగా మారింది. టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు.. ఆర్సీ 15ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. శంకర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. కాబట్టి ఆర్సీ 15 టైటిల్ అన్ని భాషల్లో ఒకేలా ఉంటుందా.. లేదా వేర్వేరుగా ఉంటుందా.. అనేది ఇంట్రెస్టింగ్గా మారింది. చాలా రోజులుగా సర్కారోడు, అధికారి, సీఎం.. అనే టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. ఇక ఇప్పుడు మరో కొత్త టైటిల్ తెరపైకి వచ్చింది. ఈ సినిమాకు శంకర్ స్టైల్లో.. పాన్ ఇండియా లెవల్లో C..E..O అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే నిజమైతే.. మెగా పవర్ స్టార్‌ను శంకర్.. ఇండియా సీఇవోగా చేయబోతున్నట్టే కనిపిస్తోంది. మార్చి 27న రామ్ చరణ్ బర్త్ డే గిఫ్ట్‌గా ఆర్సీ 15 ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ అనౌన్స్ చేయబోతున్నట్టు సాలిడ్ బజ్ ఉంది. అప్పటి వరకు ఆగితే గానీ.. ఆర్సీ 15 టైటిల్ పై క్లారిటీ రాదు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం రామ్ చరణ్ ఆస్కార్ కోసం అమెరికాలో ఉన్నాడు. శంకర్ ‘ఇండియన్2’తో బిజీగా ఉన్నాడు. రెండు సినిమాలను బ్యాలెన్స్డ్ షూటింగ్ చేస్తున్నాడు. ఇండియన్ 2 తర్వాత.. చరణ్ ఇండియాకి తిరిగి రాగానే ఆర్సీ 15 కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానుంది. ఇటీవలె పెళ్లి చేసుకొని కాస్త గ్యాప్ ఇచ్చిన హీరోయిన్ కియరా అద్వానీ.. నెక్స్ట్ షెడ్యుల్‌లో జాయిన్ అయ్యేందుకు రెడీ అవుతోంది. మరి ఫైనల్‌గా ఆర్సీ 15 టైటిల్ ఏది లాక్ చేస్తారో చూడాలి.