ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో.. సూపర్ స్టార్ మహేష్ బాబు ‘ఎస్ఎస్ఎంబీ 28’ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ఏదో ఒక పుకారు షికారు చేస్తునే ఉంది. ఈ సినిమా స్క్రిప్టు మహేష్‌కు నచ్చలేదని.. త్రివిక్రమ్ ఇంకా మార్పులు చేస్తునే ఉన్నాడని.. అందుకే ఫస్ట్ షెడ్యూల్‌ను తొందరగా చుట్టేశారని..
చాలా రోజులుగా ప్రచారంలో ఉంది. ఇక ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌ను తప్పించి.. అతని ప్లేస్‌లో టాలెంట్ అనిరుధ్‌ను తీసుకుంటున్నారనే రూమర్ వినిపిస్తోంది. దాంతో.. అసలు ఎస్ఎస్ఎంబీ 28 వెనక ఏం జరుగుతోందనే విషయం అర్థం కాకుండా పోతోంది. ప్రస్తుతం మహేష్ తన తల్లిదండ్రులను కోల్పోవడంతో.. తీవ్ర విషాదంలో ఉన్నాడు. అందుకే ఈ సినిమా షూటింగ్ డిలే అవుతు వస్తోంది.
ఈ విషయం అందరికీ తెలిసిందే.. అయినా కూడా సినిమా విషయాలతో పాటు వ్యక్తి గత విషయాల్లోను మహేష్ గురించి ఏదో ఓ న్యూస్ వినిపిస్తునే ఉంది. ముఖ్యంగా సీనియర్ హీరో నరేష్, మహేష్ బాబు మధ్య విభేదాలు ఉన్నాయనేది.. ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో.. మహేష్ తనపై వస్తున్న వార్తలతో మహేష్ ఇబ్బంది పడుతున్నాడని సన్నిహిత వర్గాల మాట.
దాంతో తన బాధలో తాను ఉంటే.. ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేసి.. ఆయనను మరింత ఇబ్బంది పెడుతున్నారని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. అయితే ఇప్పటికైనా ఇలాంటి వార్తలపై.. మహేష్ బాబు గానీ, అతని సన్నిహిత వర్గాలు గానీ స్పందిస్తాయేమో చూడాలి.