టాలీవుడ్ యంగ్ బ్యూటీ లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత భాషతో సంబంధం లేకుండా వరుస చిత్రాలతో అలరించింది. అయితే ఇటీవల మెగా హీరో వరుణ్ తేజ్(Varun Tej) ను పెళ్లిచేసుకోబోతున్నది.వీరి ఎంగేజ్మెంట్ (Engagement) కూడా జూన్-9న జరిగింది. మెగా ఇంటిలోకి స్టార్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి త్వరలోనే అడుగుపెడుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే వీరి ఎంగేజ్మెంట్ కూడా పూర్తయిపోయి ఆగస్టు 24వ తేదీన పెళ్లికి కూడా ముహూర్తం పెట్టుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలోనే ఒక సెన్సేషనల్ న్యూస్ బయటకు వచ్చింది.
లావణ్య త్రిపాఠి పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ (Pregnant) అయింది అంటూ అనేక వార్తలు వస్తున్నాయి. మరి అందులో నిజ నిజాలు ఏంటో పూర్తిగా తెలుసుకుందామా.. ప్రస్తుతం మెగా అభిమానులంతా లావణ్య త్రిపాఠి మరియు వరుణ్ తేజ్ పెళ్లి కోసం కళ్ళల్లో వత్తులు వేసుకొని ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలోనే ఆగస్టు 22వ తేదీన మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) పుట్టినరోజు ఉంది. బర్త్డే వేడుకలు ముగిసిన వెంటనే రెండు రోజులకు అంటే ఆగస్టు 24వ తేదీన వీరిద్దరూ పెళ్లి ద్వారా ఏకం కాబోతున్నట్టు తెలుస్తోంది. దగ్గరి బంధువులు మరియు విఐపి ల మధ్య వీరి వివాహ వేడుక ఇటలీలో జరిపేందుకు మెగా ఫ్యామిలీ సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.
ఈ తరుణంలోనే లావణ్య త్రిపాఠి ప్రెగ్నెంట్ అనే వార్త బయటకు వచ్చింది.అయితే వీరి వివాహం (marriage) నవంబర్ లో జరుగుతుందని భావించారు. కానీ ఇంతలోనే ఆగస్టు లో పెళ్లి అంటూ వార్తలు రావడంతో కొంతమంది ఈ ప్రచారానికి తెరలేపారు. మ్యారేజ్ జరిగే వరకు కూడా ఆగకుండా వరుణ్ తేజ్ రెచ్చిపోయాడని, దీంతో లావణ్య త్రిపాఠి ప్రెగ్నెంట్ అయిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉందో, అబద్ధం ఉందో తెలియదు కానీ సోషల్ మీడియా(Social media)లో మొత్తం వార్త విపరీతంగా చక్కర్లు కొడుతోంది.
చదవండి :Anirudh: షాకింగ్.. రెహమాన్ కాదట, అనిరుధ్ టాప్ అట?