»Is It True Star Hero As Villain In Shankar Charan Movie
Charan’s RC 15 విలన్‌గా స్టార్ హీరో! నిజమేనా..??
Charan : అస్సలు శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్‌ను ఎవ్వరు ఊహించలేదు. కానీ దిల్ రాజు ఈ కాంబోని సెట్ చేసి షాక్ ఇచ్చారు. అందుకు తగ్గట్టే శంకర్ ఆర్సీ 15ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్ బద్దలవడం పక్కా అంటున్నారు.
అస్సలు శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్‌ను ఎవ్వరు ఊహించలేదు. కానీ దిల్ రాజు ఈ కాంబోని సెట్ చేసి షాక్ ఇచ్చారు. అందుకు తగ్గట్టే శంకర్ ఆర్సీ 15ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్ బద్దలవడం పక్కా అంటున్నారు. శంకర్ స్టైల్లో పవర్ ఫుల్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటి వరకు వచ్చిన లీకులు చూస్తుంటే.. ఈ సినిమా ఊహకందని కాన్సెప్ట్‌తో రాబోతున్నట్టు కనిపిస్తోంది. ఇక స్టార్ క్యాస్టింగ్ విషయానికొస్తే.. సినిమా పై మరింత హైప్ క్రియేట్ అవుతోంది. కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో.. అంజలి, సునీల్, శ్రీకాంత్, నవీన్ చంద్ర వంటి వారు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్.జె. సూర్య విలన్‌గా నటిస్తున్నాడు. అయితే ఇప్పుడు అసలు విలన్ ఈయన కాదంటున్నారు. ఈ మధ్య కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ఈ సినిమాలో గెస్ట్ రోల్లో కనిపించబోతున్నాడనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇందులో నిజమెంతో తెలియదు గానీ.. ఇప్పుడు ఏకంగా అజిత్ విలన్‌గా నటిస్తున్నాడనే రూమర్ వైరల్‌గా మారింది. ప్రస్తుతానికి ఇది గాసిప్పే అయినా.. మెగా ఫ్యాన్స్‌కు మాత్రం గుస్ బంప్స్ తెప్పించేలా ఉంది. అసలు అజిత్ ఈ సినిమాలో గెస్ట్‌గా కనిపిండమే నమ్మశక్యంగా లేదంటే.. ఇప్పుడు విలన్ అంటుండడం అస్సలు నమ్మకుండా ఉంది. అయితే అక్కడుంది శంకర్.. కాబట్టి ఆర్సీ 15 నుంచి ఊహకందని సర్ప్రైజ్లు ఉండడం మాత్రం పక్కా. ఇక మార్చి 27న రామ్ చరణ్ బర్త్‌డే సందర్భంగా.. ఈ మూవీ ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్ రివీల్ చేయబోతున్నారు. ఈ సినిమాకు సీఇవో అనే టైటిల్ పరిశీలనలో ఉంది.. సీఇవో అంటే చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్.. ఈ టైటిల్ చాలా పవర్ ఫుల్‌గా ఉందని అంటున్నారు మెగా ఫ్యాన్స్. దీనిపై క్లారిటీ రావలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.