ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నెక్ట్స్ ప్రాజెక్ట్ అప్టేట్ కోసం.. ఎంతో ఆసక్తిగా ఎదురు చేస్తున్నారు నందమూరి అభిమానులు. ఎన్టీఆర్ 30 ప్రాజెక్ట్ ప్రకటించినప్పటి నుంచి అతృతతోనే ఉన్నారు ఫ్యాన్స్. ఎప్పుడో ఈ సినిమాకు సంబంధించిన వర్క్ స్టార్ట్ అయింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారు కొరటాల-ఎన్టీఆర్. అయినా ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌కు నిరాశే ఎదురవుతోంది.
అయితే ఎట్టకేలకు ఈ ప్రాజెక్ట్ నుంచి ఓ గుడ్ న్యూస్ రాబోతున్నట్టు తెలుస్తోంది. నెట్టింట్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం.. ఎన్టీఆర్ 30 మేజర్ అప్డేట్ అక్టోబర్ 10న రానున్నట్లు తెలుస్తోంది. అయితే ఎలాంటి అప్డేట్ ఇవ్వబోతున్నారనే విషయంలో క్లారిటీ లేదు. కానీ అది షూటింగ్‌కు సంబందించినది అయి ఉండొచ్చని అంటున్నారు. అయితే మేకర్స్ నుంచి ఇప్పటి వరకు దీనిపై అధికారిక ప్రకటన రాలేదు. ఇందులో నిజమెంతో తెలియదు కాని.. ఈ న్యూస్‌తో తారక్ అభిమానులు కాస్త ఖుషీ అవుతున్నారు.
ఇదిలా ఉంటే.. హీరోయిన్ విషయంలో కొరటాల డైలామాలో ఉన్నట్టు చాలా రోజులుగా వినిపిస్తునే ఉంది. ఇప్పటికే అరడజనుకు పైగా హీరోయిన్ల పేర్లు.. తారక్ సరసన నటించబోతున్నట్టు వినిపించాయి. అయితే లేటెస్ట్ అప్టేట్ ప్రకారం.. దాదాపుగా హీరోయిన్ ఫిక్స్ అయిపోయినట్టేనని అంటున్నారు. ఇండైరెక్ట్‌గా రష్మిక మందన్న ఎన్టీఆర్ 30లో ఫైనల్ అయినట్టు.. హిందీ మీడియాకు హింట్ ఇచ్చినట్టు వార్తలొస్తున్నాయి. దీని పై కూడా అక్టోబర్ 10న అప్టేట్ ఉండొచ్చని టాక్. మరి ఈ సారైనా ఎన్టీఆర్ 30 అప్టేట్ ఉంటుందో లేదో చూడాలి.