NTR 30 : ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఎప్పటి నుంచో లేట్ అవుతూ వస్తున్న ఈ సినిమాను.. మార్చి 23న గ్రాండ్‌గా లాంచ్ చేయబోతున్నారు. ప్రస్తుతం కొరటాల శివ.. భారీ పోర్ట్ సెట్టింగ్ పనులతో బిజీగా ఉన్నారు.
ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఎప్పటి నుంచో లేట్ అవుతూ వస్తున్న ఈ సినిమాను.. మార్చి 23న గ్రాండ్‌గా లాంచ్ చేయబోతున్నారు. ప్రస్తుతం కొరటాల శివ.. భారీ పోర్ట్ సెట్టింగ్ పనులతో బిజీగా ఉన్నారు. సముద్రం బ్యాక్ డ్రాప్లో ఈ సినిమా తెరకెక్కబోతోంది. బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. అయితే ఈ సినిమాలో విలన్‌గా బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్‌ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయంలో మేకర్స్ నుంచి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం ఎన్టీఆర్ 30 పూజా కార్యక్రమాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఓపెనింగ్‌కు సైఫ్ అలీ ఖాన్ రాబోతున్నట్టు తెలుస్తోంది. అదే రోజు విలన్ అనౌన్స్మెంట్ ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం సైఫ్ అలీఖాన్.. ప్రభాస్ నటిస్తున్న ‘ఆదిపురుష్’ మూవీలో రావణుడిగా నటిస్తున్నాడు. ఎన్టీఆర్ 30 భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో రాబోతున్న సినిమా కావడంతో.. భారీ పారితోషికం ఇచ్చి మరీ.. ఈ బాలీవుడ్ స్టార్‌ను విలన్‌గా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే జాన్వీ కపూర్‌కు 5 కోట్ల రెమ్యూనరేషన్ ఇస్తున్నట్టు టాక్ ఉంది. ఈ లెక్కన కొరటాల శివ.. ఈ సినిమాను ఎంత భారీగా ప్లాన్ చేస్తున్నాడో అర్ధం చేసుకోవచ్చు. పైగా ఆర్ఆర్ఆర్ ఆస్కార్ కొట్టేయడంతో.. ఎన్టీఆర్ గ్లోబల్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. కాబట్టి.. ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు కొరటాల. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకు.. కోలీవుడ్ యంగ్ టాలెంట్ అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మరి ఎన్టీఆర్ 30 ఎలా ఉంటుందో చూడాలి.