»Independence Day Special Song Starring Sai Dharam Tej And Swati Released By Ram Charan
Independence day special సాంగ్… రామ్ చరణ్ చేతులు మీదుగా రిలీజ్
హీరో సాయి ధరమ్ తేజ్, హీరోయిన్ కలర్ స్వాతి నటించిన ఇండిపెండెన్స్ డే స్పెషల్ ది సోల్ ఆఫ్ సత్య అనే పాటను రామ్ చరణ్ చేతులు మీదుగా ఈ రోజు విడుదల చేశారు. ప్రస్తుతం ఈ సాంగ్ అందరి మనసును దోచుకుంటోంది.
Independence day special Song starring Sai Dharam Tej and Swati.. Released by Ram Charan
The Soul Of Satya : సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) వరుస సినిమాలతో అలరిస్తున్నాడు. విరూపాక్ష (Virupaksha), బ్రో (Bro) సినిమాలతో సూపర్ హిట్లను అందుకొని అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపారు. తాజాగా ఆయన నటించిన ఓ కాన్సెప్ట్ సాంగ్ విడుదలైంది. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. అయితే ఇండిపెండెన్స్ డే సందర్భంగా విడుదలైన సాంగ్ కాబట్టి అందరూ ఊహించినట్లే అది ఎమోషనల్, అలాగే సందేశాత్మకమైన సాంగ్ కావడం విశేషం. గతంలో కూడా ఈ హీరో డ్రింక్ చేసి డ్రైవింగ్ చేయొద్దు అనే కాన్సెప్ట్‌లో నటించాడు.
ఇప్పుడు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మరో ఎమోషనల్, ప్రేమ, దేశభక్తి అంశాలున్న ది సోల్ ఆఫ్ సత్య అనే కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సాంగ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా విడుదలైన సాంగ్ ప్రతి ఇండియన్ గుండెను టచ్ చేసింది. ఇందులో సాయి ధరమ్ ఒక సోల్జర్ గా కనిపించగా.. అతని భార్యగా నటి కలర్స్ స్వాతి (Swathi Reddy) నటించింది.